iDreamPost

ఉరుకులు పరుగులు మీద రామోజీని కలవనున్న బాబు.. దేని కోసం..?

ఉరుకులు పరుగులు మీద రామోజీని కలవనున్న బాబు.. దేని కోసం..?

వరుస ఐటి దాడులు భారీ అక్రమాలు కుంభకోణాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు , రామోజీ రావును కలవనున్నారు. ఈ మేరకు ఈ కుంభకోణాల నుంచి ఎలా తప్పించుకోవాలి, దిద్దుబాటు చర్యలు ఎలా చేపట్టాలి అన్నవి. చర్చించేందుకే ఈభేటీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ,ఢిల్లీ, మహారాష్ట్రలో ఆదయపుపన్ను అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తదితర అధికారుల బృందాలు జరిపిన వరుస సోదాల్లో భారీ ఆర్థిక అక్రమాలు,కుంభకోణాలు వెలుగు చూశాయి. ప్రాథమికంగా దాదాపు రూ.2,000 కోట్ల అక్రమ లావాదేవీలను కనుగొన్నట్లు సీనియర్ ఐటి అధికారి సురభి అహ్లువాలియా ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఢిల్లీ, విశాఖ,హైదరాబాద్, పూణే వంటి మొత్తం 40 చోట్ల దాడులు చేశారు. ఇందులో సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు,చంద్రబాబు సన్నిహితులు కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలను తవ్వే కొద్దీ ఆ మార్గాలన్ని చంద్రబాబు వద్దకే దారితీసినట్లు ఐటి అధికారులు గుర్తించారు. రోజూ కోటి రూపాయలు మేడం కు ఇచ్చేవాడిని అంటూ చంద్రబాబు మాజీ పీఏ పెండ్యాల శ్రీనివాస్ ఇక హీన వాంగ్మూలం ఆధారంగా ఐటి అధికారులు దాడులు చేసి భారీగానే అక్రమాలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కుంభకోణాల నుంచి బయటపడేందుకు చంద్రబాబు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంతరంగిక సలహాదారు, తమ రాజగురువు అయిన రామోజీరావును కలిసి ఈ మొత్తం వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు ఉన్న అవకాశాలను వారిద్దరూ చర్చిస్తారని తెలుస్తోంది. న్యాయపరమైన అంశాలు, కోర్టుల్లో ఎలా మ్యానేజ్ చేయవచ్చు తదితర అన్ని మార్గాల మీదా వారు చర్చిస్తారని తెలుస్తోంది.

నేడు అమిత్ షా తో జగన్ భేటి

ఇదిలా ఉండగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలవనున్నారు. మొన్ననే ప్రధాని మోదీని కలిసిన జగన్ ఏపీలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన పలు కుంభకోణాలకు సంబంధించిన ఆధారాలు ప్రధానికి అందించారని తెలిసింది. నేడు అమిత్ షా కు కూడా మరిన్ని కీలక ఆధారాలు ఇచ్చి చంద్రబాబు పై దర్యాప్తు చేసేందుకు మార్గం సుగమం చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదరాబాదరాగా చంద్రబాబు వెళ్లి రామోజీని కలుస్తున్నారని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి