iDreamPost

BREAKING: ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు! జైలుకు చంద్రబాబు

  • Published Sep 10, 2023 | 10:20 AMUpdated Sep 10, 2023 | 6:48 PM
  • Published Sep 10, 2023 | 10:20 AMUpdated Sep 10, 2023 | 6:48 PM
BREAKING: ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు! జైలుకు చంద్రబాబు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆంధ్రప్రదేశ్‌ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. రూ.371 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఏపీ సీఐడీ ప్రాథమిక ఆధారణలతో చంద్రబాబును శనివారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్‌ తర్వాత చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆదివారం ఉదయం ప్రవేశపెట్టారు. కోర్టులో సీఐడీ తరఫు లాయర్లకు-చంద్రబాబు తరుఫున లాయర్లకు మధ్య వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఇరు వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో చంద్రబాబును 14 రోజుల రిమాండ్‌కు పంపింది. వాదన సమయంలో చంద్రబాబు కోర్డులోనే ఉంటానని న్యాయమూర్తిని కోరడంతో కోర్టు హాల్‌లో ఉంటారా అని బాబుని న్యాయమూర్తి అడిగారు.

రాయకీయ కుట్ర నేపథ్యంలోనే తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని చంద్రబాబు తన వాదనను వినిపించారు. చంద్రబాబు వాదనలను న్యాయమూర్తి రికార్డ్‌ చేశారు. తనకు శనివారం ఉదయం 5.40కి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఈ రోజు ఉదయం 5.40కి రిమాండ్ రిపోర్ట్‌ ఇచ్చారని అన్నారు. అయితే.. చంద్రబాబు వాదనను సీఐడీ తరఫు లాయర్లు తిప్పికొట్టారు. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును 24 గంటలలోపే కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన విషయాల్లో మరింత సమాచారం రాబట్టేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీకి సీఐడీ పోలీసులు కోర్టును కోరారు. మరి ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అసెంబ్లీ సాక్షిగా బాబు స్కామ్ ఆనాడే బయటపెట్టిన CM జగన్

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి