iDreamPost

సోషల్ మీడియా సెన్సేషన్ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ACB సోదాలు

సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ప్రభుత్వ ఉద్యోగి సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా ఇంట్లో అవినితీ నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ప్రభుత్వ ఉద్యోగి సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా ఇంట్లో అవినితీ నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియా సెన్సేషన్ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ACB సోదాలు

ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగి. సోషల్ మీడియా పుణ్యమా అని సెన్సేషనల్ గా మారింది. ఓ వైపు ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే మరో వైపు సేవా కార్యక్రమాలు చేస్తూ పాపులారిటీ పొందింది. పేద వారికి నిత్యావసర సరుకులు అందించడం.. స్థానికులతో కలిసి వ్యవసాయ పనులు చేయడం.. నిరుపేదలకు ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంది. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. ఆమె మరెవరో కాదు సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా. గత నెలలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగి అయిన తస్లీమా చేసే సేవా కార్యక్రమాలకు పౌర సమాజం నుంచి ఎనలేని గౌరవం దక్కింది. మానవత్వానికి మారుపేరంటూ తస్లీమాపై ప్రజలు ప్రశంలు కురిపించారు. నేటి తరానికి ఆదర్శం అంటూ ఆమెను ఆకాశానికెత్తారు. మంత్రి సీతక్కతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో మరింత గుర్తింపు లభించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటీవల తస్లీమా చేసిన అవినీతి బాగోతం అందరినీ షాక్ కు గురిచేసింది. తస్లీమా మహబూబాబాద్ జిల్లాకు చెందిన గుండగాని హరీశ్‌ స్థల రిజిస్ట్రేషన్ కు డబ్బులు డిమాండ్ చేసింది. బాధితుడు చేసేదేం లేక ఏసీబీ అధికారును సంప్రదించాడు.

ఆ తర్వాత హరీశ్‌ గత నెల 22న కార్యాలయానికి వెళ్లి సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమాకు డబ్బులు ఇవ్వబోయాడు. ఆఫీస్‌లో పనిచేసే వెంకటేశ్‌కు ఇవ్వాలని ఆమె సూచించడంతో బాధితుడు హరీశ్‌ రూ.19,200ను వెంకటేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తస్లీమాతోపాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి వెంకటేశ్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా ఏసీబీ అధికారులు మహబూబాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా మహ్మద్‌ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని ఆమె ఇంటితోపాటు సూర్యాపేటలో నివాసముంటున్న తస్లీమా భర్త ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి