iDreamPost

అచ్చెం నాయుడును పరామర్శించలేకపోయిన చంద్రబాబు

అచ్చెం నాయుడును పరామర్శించలేకపోయిన చంద్రబాబు

 ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి గుంటూరు వచ్చారు. ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబు వచ్చారు. అయితే కోవిడ్‌ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వడం సాధ్యం కాదంటూ అధికారులు చెప్పారు. ఈ క్రమంలో జీజీహెచ్‌ సూపరిండెంటెండ్‌తో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు అచ్చెం నాయుడు ఆరోగ్యంపై ఆరా తీశారు.

ఆస్పత్రి ముందు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఎప్పటిలాగే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. ‘‘టీడీపీ అభివృద్ధి కోసం అచ్చెం నాయుడు కుటుంబం పని చేసింది. ఏసీబీ వాళ్లు ఆయన బెడ్‌ రూంలోకి వెళ్లి అరెస్ట్‌ చేశారు. వైసీపీ బెదిరింపులకు పాల్పడుతోంది. టీడీపీ నేతలను లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. దేశంలో ఉన్న చట్టం రాష్ట్రంలో అమలు కావడం లేదు’’ అంటూ చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. అయితే ఇంత సేపు మాట్లాడిన చంద్రబాబు అచ్చెం నాయుడును ఎందుకు అరెస్ట్‌ చేశారు..? ఈఎస్‌ఐ స్కాం జరిగిందనో లేదా జరగలేదనో కూడా మాట్లాడకపోవడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి