iDreamPost

బాబు పీఏను విదేశాలకు అందుకే పంపించారా? ఆ ముఠా ఉండుంటే?

బాబు పీఏను విదేశాలకు అందుకే పంపించారా? ఆ ముఠా ఉండుంటే?

చట్టం ఎవరికీ చుట్టం కాదు అని మరోసారి నిరూపితమైంది. తప్పు చేస్తే ఎంతటి వ్యక్తులైన చట్టానికి లొంగిపోవాల్సిందే అని తేలిపోయింది. తాజాగా ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారమే దీనికి నిదర్శనం. యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్దంగా నిధులను కాజేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం అరెస్టు అయిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 240 కోట్ల స్కామ్ కు పాల్పడ్డారని ఏపీ సీఐడీ పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు అని సీఐడీ నిర్ధారించింది.ఈ క్రమంలోనే నంద్యాలలో బస చేస్తున్న చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధమున్న బాబు ముఠా విదేశాలకు వెళ్లడానికి కారణమేంటని పలువురు ఆరోపిస్తున్నారు.

గతంలో తెలంగాణలో ఓటుకో నోటు కేసులో తప్పించుకున్న బాబు నేడు స్వరాష్ట్రంలో జరిగిన స్కామ్ లో దొరికి పోవడంతో టీడీపీ శ్రేణులు, నాయకులు జీర్ణించుకోలేక పోతున్నాయి. వాస్తవానికి ఈ స్కామ్ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే బయటకు పొక్కింది. కానీ దానిని కప్పి పుచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు. అయితే ఈ కేసులో ఇదివరకే కొందరు అధికారులను అరెస్టు చేశారు పోలీసులు. ఇటీవల లెక్కల్లో చూపని 118 కోట్ల ఆదాయానికి సంబంధించి ఆదాయపన్ను శాఖ బాబుకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసుతో పాటు స్కిల్ కేసుకు వాటికి ఉన్న సంబందం మొదలైనవాటిని కూపీ లాగేందుకు చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్‌కు అలాగే మనోజ్ వాసుదేవ్ పార్ధసాని, యోగేష్ గుప్త అనేవారికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చారు. ఈ కారణంతోనే వారు శ్రీనివాస్ , మనోజ్లు దేశం విడిచివెళ్లిపోయారని అధికార పక్షం వారు ఆరోపిస్తున్నారు.

వారు విచారణకు వస్తే మొత్తం బండారం బయట పడుతుందనే చంద్రబాబే వారిని విదేశాలకు పంపించి ఉంటారని వైసీపీవారు ఆరోపిస్తున్నారు. వారు ఏపీ నుంచి పరారీకాకుండా ఉంటే సీఐడీ పోలీసులు ఈ వ్యవహారంపై లోతుగా విచారించేవారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ కు కారకుడైన చంద్రబాబునే సీఐడీ అరెస్టు చేసింది.ఇక చంద్రబాబు అరెస్టు పై సీఐడీ అదనపు డిజి సంజయ్ కేసు పూర్తి వివరాలు ఇస్తూ, చంద్రబాబే కుట్రదారుడు , చంద్రబాబే అంతిమ లబ్దిదారుడు అని తేలినట్లు వెల్లడించారు. ఇందులో చంద్రబాబు కుమారుడు లోకేష్ పాత్రను కూడా విచారిస్తున్నామని చెప్పారు.స్కిల్ కేసుతో పాటు, అమరావతి స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్లలో ఆయన పాత్రపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఈ దెబ్బతో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలు అన్నీ బయటకు వచ్చేలా ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి