iDreamPost

రెండో దశ లాక్ డౌన్ పై కేంద్రం మార్గదర్శకాలు

రెండో దశ లాక్ డౌన్ పై కేంద్రం మార్గదర్శకాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రాని నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. నిన్న లాక్ డౌన్ పొడిగింపు పై నిన్న ప్రకటన చేసిన ప్రధాని నరేంద్రమోదీ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేస్తామని చెప్పారు. ఈ మేరకు తాజాగా రెండో విడత లాక్ డౌన్ పై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది.

– మే 3 వరకు అన్ని రైళ్ళు విమానాలు మెట్రో సర్వీసులను పూర్తిగా రద్దు.

– హాట్ స్పాట్ లో నిబంధనలు మరింత కఠినంగా అమలు.

– బయటికి వచ్చే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలి.

– స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, స్విమ్మింగ్ పూల్స్ మే 3 వరకు నిషేధం.

– ఏప్రిల్ 20వ తేదీ నుంచి వ్యవసాయ రంగానికి మినహాయింపు.

– ఏప్రిల్ 20 తర్వాత నిర్దేశిత పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి.

– క్రయ, విక్రయాల కోసం మండీలకు అనుమతి.

– బహిరంగ ప్రదేశాల తో పాటు కార్యాలయాల్లోనూ మాస్కులు ధరించడం తప్పనిసరి.

– ఏప్రిల్ 20 లోపు వైరస్ కట్టడి జరిగిన ప్రాంతాల్లోనే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

– ఆన్లైన్ షాపింగ్, ఇ-కామర్స్ కు అనుమతి.

– రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణా లు బంద్.

– గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నిర్వహణకు అనుమతి.

– పరిమితంగా నిర్మాణ రంగ పనులకు అనుమతి.

– కాఫీ తేయాకు పంటల్లో 50శాతం కూలీలకు అనుమతి.

– పట్టణ ప్రాంతాల్లో లేని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కు అనుమతి.

– పరిశ్రమల్లో 50శాతం కార్మికులకు అనుమతి.

– కార్మికుల రవాణా వాహనాల్లో 30 40 శాతం మందికి మాత్రమే అనుమతి.

– పరిశ్రమల్లో కి రాను పోను మార్గాల్లో శానిటైజేర్లు తప్పనిసరి.

– గుట్కాలు, పొగాకు అమ్మకాలు పూర్తిగా నిషేధం.

– మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలకు పూర్తిగా నిషేధం.

– బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమాన.

– అంత్యక్రియలకు 20 మంది మాత్రమే అనుమతి.

– విద్యాసంస్థల కార్యకలాపాలు పూర్తిగా నిషేధం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి