iDreamPost

ఈ నెంబర్ వాడితే మరణం ఖాయం.. ఒకే నెంబర్ వాడి ముగ్గురు మృతి!

నిత్యం అనేక విచిత్రమైన వార్తలు వింటాము. అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రాంతంలో ఓ నెంబర్ ను వాడితే మరణిస్తున్నారు. ఇప్పటికే ఆ నెంబర్ వాడి ముగ్గురు మృతి చెందారు.

నిత్యం అనేక విచిత్రమైన వార్తలు వింటాము. అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రాంతంలో ఓ నెంబర్ ను వాడితే మరణిస్తున్నారు. ఇప్పటికే ఆ నెంబర్ వాడి ముగ్గురు మృతి చెందారు.

ఈ నెంబర్ వాడితే మరణం ఖాయం.. ఒకే నెంబర్ వాడి	ముగ్గురు మృతి!

నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇవిలేని వారు చాలా అరుదుగా ఉంటారు. ఇక స్మార్ట్ ఫోన్ ఉంది అంటే అందులే కచ్చితంగా సీమ్ అనేది ఉంటాది. అలానే  ఇక సిమ్ కార్డుల విషయంలో చాలా మంది తమకు ఇష్టమైన నెంబర్ ను, ఫ్యాన్సీ నెంబర్లను ఎంచుకుంటారు. చాలా యూనిక్ గా ఉండాలని ఏరికోరి మరి…నెంబర్ ను ఎంచుకుంటారు. అయితే ఓ ప్రాంతంలో మాత్రం ఓ నెంబర్ ను వాడితే మరణిస్తున్నారు. ఇప్పటికే ఆ నెంబర్ వాడి ముగ్గురు మృతి చెందారు. దీంతో స్థానిక అధికారులు అలెర్ట్ అయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఏమిటి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నిత్యం అనేక విచిత్రమైన వార్తలు వింటాము. ఫలాన ఇళ్లు కొన్నవాళ్ళుల చనిపోయారని, ఫలాన కారును కొనుగోలు చేసిన వారికి రోడ్డు ప్రమాదాలు జరిగాయాని, అలానే ఫలానా నెంబర్ వెహికల్ తో అన్ని నష్టాలే జరుగుతాయి.. ఇలా ఎన్నో రకలా వార్తలు వివిధ అంశాలపై వస్తుంటాయి. తాజాగా అలానే ఓ ఫోన్ నెంబర్ విషయంలో అలాంటి వార్తే ప్రచారం జరుగుతోంది. ఆ వింత సంఘటనకు సంబంధించిన విషయాలు బయటకు రావడంతో అంతా భయపడిపోతున్నారు.

బల్గేరియాలో ఒక ఫోన్ నెంబర్ వాడిన వారంతా అనుమానస్పద స్థితి మరణిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో స్థానిక ప్రభుత్వం ఆ ఫోన్ నెంబర్ ను వినియోగించకుండా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ నంబర్ యొక్క మొదటి యజమాని, బల్గేరియన్ మొబైల్ ఫోన్ కంపెనీ మొబిటెల్ యొక్క మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్లాదిమిర్ గ్రాష్నోవ్ ఉన్నారు. ఈ సంస్థ +359 888 888 888 నంబర్‌ను జారీ చేసింది. 2001లో  వ్లాదిమిర్ క్యాన్సర్‌తో 48 ఏళ్ల  మరణించాడు. అసలు అతనికి క్యాన్సర్ లేకున్నా కూడా ఈ నెంబర్ తీసుకున్నా తరువాత రేడియో పాయిజనింగ్ వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆ నెంబర్ 2003లో కోన్‌స్టాన్టిన్ డిమిట్రోవ్ అనే వ్యక్తి తీసుకున్నాడు. ఆ తర్వాత ఊహించని విధంగా కాల్పుల్లో మృతి చెందినట్లు సమాచారం.

అదే విధంగా 2005 డిష్లీవ్ అనే వ్యాపారవేత్త ఈ నెంబర్ వాడి ఇండియన్ రెస్టారెంట్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. మొత్తంగా ‘‘+359888888888’’ అనే ఫ్యాన్సీ నెంబర్ అందరిని భయపెడుతోంది. అది వాడిన తర్వాత జనాలు ఎందుకు చనిపోయారనే విషయంపై క్లారిటీ లేదు, అలానే మిస్టరీగా ఉంది.  వైరల్ అవుతున్నఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఈ వార్త చూసిన వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఎవరైనా ఈ నంబర్‌కు కాల్ చేసినప్పుడు “బయటి నెట్‌వర్క్ కవరేజ్” అని రికార్డ్ చేయబడిన వాయిస్ మేసేజ్  వస్తుందంట. మరి.. ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి