iDreamPost

కెనడాలోని భారత పౌరులకు కేంద్రం కీలక సూచనలు

కెనడాలోని భారత పౌరులకు కేంద్రం కీలక సూచనలు

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యతో భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు రేకెత్తుతున్నాయి. హర్ దీప్ సింగ్ హత్య వెనక భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన ఆరోపణలు తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీశాయి. కెనడాలో భారత రాయబారిని బహిష్కరించగా, దానికి బదులుగా కెనడా రాయబారిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. ఈ క్రమంలోనే కెనడాలోని భారత పౌరులకు, భారతీయ సంస్థలపై దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కెనడాలోని భారత పౌరులకు, విద్యార్థులకు కీలకమైన సూచనలు చేసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో కోరింది.

కెనడాలో ఖలిస్థాని సానుభూతిపరుడి హత్యతో భాతర్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కెనడాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలోని పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అక్కడి భారతీయులు ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని, సాధ్యమైనంతవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కేంద్రం కోరింది. సమస్యాత్మక ప్రాంతాలు, హింసకు దారితీసే ఘటనలు చోటుచేసుకుంటున్న ప్రాంతాలకు వెల్లకూడదని కేంద్రం కోరింది.

కాగా కెనడాలో నివసిస్తున్న భారత పౌరులు, ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులను సంరక్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వారికి ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా కెనడాలోని భారత హైకమిషన్ రాయబార కార్యాలయంతో చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కెనడాలో భారత పౌరులకు ప్రతికూలమైన పరిస్థితులు ఉండడంతో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్రం కోరింది. పరిస్థితులు చేయిదాటినప్పుడు మిమ్మల్ని సంప్రదించేందుకు వీలు ఏర్పడుతుందని భారత విదేశాంగ శాఖ అడ్వైజరీలో పౌరులకు సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి