iDreamPost

జగన్ విజ్ఞప్తి – ప్రభుత్వానికి సిమెంటు కంపెనీల హామీ.

జగన్ విజ్ఞప్తి – ప్రభుత్వానికి సిమెంటు కంపెనీల హామీ.

ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి మేరకు పేదల ఇళ్ళకు, పోలవరం ప్రాజెక్టుకు, వివిధ ప్రభుత్వ పనులకు సరఫరా చేసే సిమెంటు రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివిధ సిమెంట్‌ కంపెనీల యజమానులు, ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి, ప్రస్తుతం మార్కెట్లో సిమెంటు బస్తా రేటు 380 వరకు ఉండగా , సి.యం జగన్ విజ్ఞప్తి మేరకు 235 రూపాయలకే ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. గత 5ఏళ్లతో పోలిస్తే 235 రూపాయల రేటుకు సిమెంటు సరఫరా చెయటం ఇదే ప్రథమంగా చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని అలాగే పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్‌ తెలియజేశారు. వీటితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు కలిపి మొత్తం మీద 1,19,43,237 మెట్రిక్‌ టన్నుల సిమెంటు ప్రభుత్వానికి అవసరం అవుతుందని, కావున సిమెంటు సరఫరాలో కానీ, ఉత్పత్తిలో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిమెంటు కంపెనీలు సహకరించాలని కోరారు.

సి.యం జగన్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సిమెంటు కంపెనీలు ప్రభుత్వానికి సిమెంటుని అతి తక్కువ ధరకే సరఫరా చేసేందుకు అంగీకరిస్తునట్టు ప్రకటించాయి. అలాగే సిమెంటు సరఫరాలో కానీ ఉత్పత్తిలో కానీ ఎలాంటి జాప్యం ఉండకుండా చూసుకుంటామని సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకునేందుకు కంపెనీ తరుపున సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంటామని తెలిపాయి. ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి తరువాత సిమెంట్ కంపెనీలు సానుకూలంగా స్పందించడంతో ప్రభుత్వ ఖజానాకు పెద్దమొత్తంలో ఆదా అవడం ఖాయంగా కనిపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి