iDreamPost

క్యాబ్‎ ప్రయాణికులకు షాక్.. ఇకపై కారులో AC కావాలంటే ఇలా చేయాల్సిందే!

మీరు క్యాబ్ లో ప్రయాణిస్తుంటారా? అయితే మీలాంటి వారికి బిగ్ షాక్. ఇకపై మీరు ప్రయాణించే క్యాబ్ లో ఏసీ కావాలంటే ఇలా చేయాల్సిందే. ఇంతకీ ఏం చేయాలో తెలుసా?

మీరు క్యాబ్ లో ప్రయాణిస్తుంటారా? అయితే మీలాంటి వారికి బిగ్ షాక్. ఇకపై మీరు ప్రయాణించే క్యాబ్ లో ఏసీ కావాలంటే ఇలా చేయాల్సిందే. ఇంతకీ ఏం చేయాలో తెలుసా?

క్యాబ్‎ ప్రయాణికులకు షాక్.. ఇకపై కారులో AC కావాలంటే ఇలా చేయాల్సిందే!

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. జనాలు ఎండ వేడిమి, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటలకు రావాలంటేనే జంకుతున్నారు. ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే ఏసీ ఉన్న వాహనాల్లో ప్రయాణించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా క్యాబ్ లల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే మండే వేసవిలో క్యాబ్ ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. ఇక నుంచి కారులో ఏసీ కావాలంటే అదనంగా చెల్లించాల్సిందే. దీనిపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యుయు) కీలక నిర్ణయం తీసుకుంది.

ఉబర్, ఓలా, రాపిడో వంటి సంస్థలు ప్రైవేట్ రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బుక్ చేసుకున్న క్షణాల్లోనే కస్టమర్ ఉన్న చోటుకే వచ్చేస్తున్నాయి. అయితే ఉబెర్, ఓలా, రాపిడో వంటి ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్ల నిర్ణయం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఈ సంస్థలు కిలోమీటర్ ఛార్జీలను తగ్గించాయి. దీంతో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ ఏప్రిల్ 8వ తేదీన ‘నో ఎసి క్యాంపెయిన్’ ప్రకటించింది. ఆయా యాప్ లలోని క్యాబ్ డ్రైవర్లు కిలోమీటర్ ఛార్జీలను తగ్గించడం కారణంగా క్యాబ్ లలో ఏసీని ఆన్ చేయలేకపోతున్నామని వెల్లడించారు. తమ క్యాబ్‌లను ఏసీతో నడపాలంటే కిలోమీటరుకు అదనంగా రూ. 16-18 ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలు వసూలు చేస్తున్న కమీషన్‌లతో డ్రైవర్లు కిలోమీటరుకు రూ. 10-12 రూపాయలు మాత్రమే పొందగలుగుతున్నారని గిగ్ వర్కర్ సంఘాలు తెలిపాయి. దీంతో ఏసీలను ఆన్ చేయలేకపోతున్నామని తెలిపారు. తమ క్యాబ్ ఎక్కిన కస్టమర్లందరూ.. రైడ్‌ల సమయంలో AC కావాలంటే దానికి తగిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. క్యాబ్ డ్రైవర్ల నిర్ణయంతో ప్రయాణికులకు మరింత భారం పడనుంది. ఈ క్యాంపైన్ లో తమకు సహకరించండి అని కోరినట్లు తెలిపారు. అలాగే తమ డిమాండుకు సరిపడా చిట్కాను అందించమని కస్టమర్లను అభ్యర్థిస్తున్నాము అని తెలిపారు. కస్టమర్లే తమకు దేవుళ్లని వారిని ఇబ్బంది పెట్టబోమని ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలు కిలోమీటర్ ఛార్జీలు తగ్గించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి