iDreamPost

గేదెను గుద్దిచంపిన వ్యక్తి.. 28 ఏళ్ల తర్వాత షాకిచ్చిన కోర్టు!

గేదెను గుద్దిచంపిన వ్యక్తి.. 28 ఏళ్ల తర్వాత షాకిచ్చిన కోర్టు!

మన దేశంలోని న్యాయ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నప్పటికి.. నత్తనడకగా సాగుతున్న విధానాల చూస్తే మాత్రం విమర్శలు చేయాలనిపిస్తోంది.  మన న్యాయ వ్యవస్థలో ఎన్నో తీర్పులు వచ్చిన విధానం చూస్తే.. మీరు అవునకక ఉండరు. తాజాగా అలాంటి  ఘటన ఒకటి యూపీలో జరిగింది. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం ఓ గేదెను గుద్ది చంపినందుకు… 28 త రువాత ఓ పెద్దాయనకు కోర్టు షాకిచ్చింది.  కోర్టు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్‌ చేస్తామంటూ హెచ్చరించి వెళ్లాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లా బర్కాబాన్కీలో 83 అచ్చన్ నివాసం ఉంటున్నాడు.1994లో రవాణా శాఖలో డ్రైవర్ గా పని చేశాడు. అదే సమయంలో  విధుల్లో ఉండగా ఓ బర్రెను కొట్టాడు. దీంతో ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అలా దాదాపు  28 ఏళ్ల గడిచిపోయింది. చాలా కాలం తరువాత తాజాగా ఆ కేసులో బయటికి వచ్చింది. 28 ఏళ్ల కిందటి నాటి ఈ కేసులో..  ఓ పెద్దాయనకు తాజాగా నోటీసులు అందాయి. ఆ నోటిసులను పోలీసులు ఇంటికి వెళ్లి మరీ అందించారు. అసలే పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆ పెద్దాయన ఆ నోటీసులు చూసి ఇంకా వణికిపోతున్నాడట.

ఆ నోటీసులు ఇప్పుడు పోలీసులు బరాబాన్కీలో ఉన్న ఇంటికి వెళ్లి మరీ అందజేశారు. ఆ సమన్లను చూసి పాపం పెద్దాయన అచ్చన్‌ షాక్‌ తిన్నాడు. 1994 ప్రాంతంలో ఘటన జరిగితే.. ఇప్పుడు పోలీసులు రావడంతో ఏంటని అచ్చన్‌ పాపం భయంతో వణికి పోతున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు సార్లు సమన్లు వస్తే.. బెయిల్‌ తెచ్చుకున్నాడట. మళ్లీ 28 ఏళ్లు తర్వాత కేసు వెలుగులోకి రావడంతో పాపం ఆ పెద్దాయన వణికిపోతున్నాడు.  మరి… ఈ బర్రె కేసు ఏ మలుపు తిరుగుతుందో ఎదురు చూడాలి. మరి.. ఇలా ఏళ్ల తరువాత స్పందించిన న్యాయవ్యవస్థ పనితీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి