iDreamPost

BRSకు మరో షాక్.. సీఎం రేవంత్ తో పట్నం మహేందర్ రెడ్డి దంపతుల భేటీ!

మాజీ మంత్రి, భారాసా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బతగిలింది.

మాజీ మంత్రి, భారాసా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బతగిలింది.

BRSకు మరో షాక్.. సీఎం రేవంత్ తో పట్నం మహేందర్ రెడ్డి దంపతుల భేటీ!

BRS పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు పార్టీని వీడగా.. అదే బాటలో మరికొందరు పయణిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బతగిలింది. మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి, వికారాబాద్ జడ్సీ ఛైర్ పర్సన్ సునీతారెడ్డి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో వారు భారాసాను వీడనున్నట్లు స్పష్టమైంది. ఇదే విషయాన్ని సునీతారెడ్డి కూడా ధృవీకరించారు. తాము వారం రోజుల్లో కాంగ్రెస్ లో చేరుతామని ఆమె మీడియాకు వెల్లడించారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకరివెంట ఒకరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు పార్టీకి రాజీనామ చేయగా.. ఇదే బాటలో మరికొంత మంది నాయకులు కొనసాగుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి సునీతారెడ్డి పార్టీని వీడుతున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రేవంత్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటుగా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కొడుకు రినీష్ రెడ్డి పాల్గొన్నారు.

shock for brs party

సీఎం రేవంత్ తో భేటీ అనంతరం పలు విషయాలను మీడియాకు వెల్లడించారు సునీతారెడ్డి. తమ కార్యకర్తలతో కలిసి వారం రోజుల్లో కాంగ్రెస్ లో చేరుతామని ఆమె స్పష్టం చేశారు. అయితే ఢిల్లీలో చేరాలా? లేక జిల్లాలోనే సభ నిర్వహించి చేరాలా? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సునీతారెడ్డి కాంగ్రెస్ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నట్లుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు టీకెట్ ను మహేందర్ రెడ్డి ఆశించారు. కానీ భారాసా అధిష్ఠానం ఆ టికెట్ ను రోహిత్ రెడ్డికి కేటాయించింది. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: CM రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అవినీతికి చెక్.. కొత్తపాలసీకి ఆదేశాలు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి