iDreamPost
android-app
ios-app

CM రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అవినీతికి చెక్.. కొత్తపాలసీకి ఆదేశాలు..!

  • Published Feb 09, 2024 | 9:10 AM Updated Updated Feb 09, 2024 | 9:10 AM

Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

  • Published Feb 09, 2024 | 9:10 AMUpdated Feb 09, 2024 | 9:10 AM
CM రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అవినీతికి చెక్.. కొత్తపాలసీకి ఆదేశాలు..!

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. అలానే ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తగ్గట్టుగా అధికారులు మసలుకోవాలని సూచించారు. ముందు ప్రజలు.. తర్వాతే తాము అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అవినీతి నిర్మూలనకు కృషి చేస్తామని ప్రకటించిన రేవంత్‌ రెడ్డి.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇసుకు రవాణాలో అవినీతికి చెక్‌ పెట్టేలా కొత్త పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించడమే కాక వార్నింగ్‌ కూడా ఇచ్చారు. సీఎం నిర్ణయం ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు..

రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్తపాలసీ రూపొందించాలంటూ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో గురువారం నాడు.. గనులశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. తమిళనాడు, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేసి.. కొత్త పాలసీ రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తోన్న ఇసుక విధానం అవినీతి దందాగా మారిందని.. తవ్వకాలు, రవాణాలో అడుగడుగునా అక్రమాలు జరగుతున్నాయంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుమారు 25 శాతం ఇసుక అక్రమంగా తరలిపోతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్‌లు, డంప్‌లు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Revanth Reddy's sensational decision

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందన్న సీఎం రేవంత్.. మైనింగ్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళణ చేయాలని తెలిపారు. కొందరు అధికారులు.. అక్రమార్కులతో చేతులు కలిపి ఇసుకు అక్రమ రవాణా, అక్రమ దందాలకు తెర లేపినట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో 48 గంటల్లో అధికారులు తమ పద్ధతిని మార్చుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ వారికి రేవంత్‌ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో విజిలెన్స్, ఏసీబీ అధికారులతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టి.. టీఎస్ఎండీసీ లో అక్రమాలను అరికట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధ్యులు ఎంతటి వారైనా.. వదిలే ప్రసక్తే లేదని మరోసారి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

మరోవైపు.. తెలంగాణలో ఇసుక అమ్మకాలకు సంబంధించి కొత్త పాలసీని తయారు చేయాలంటూ సీఎం రేవంత్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక ప్రాంతాల్లో ఇసుక పాలసీలపై అధ్యయనం చేసి.. వాటిల్లో ఉత్తమమైన వాటిని సెలక్ట్‌ చేసుకుని..  రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని రూపిందించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Giriş