iDreamPost

ఓటమిపై తొలిసారి స్పందించిన బీఆర్ఎస్ అధినేత KCR!

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఓటమి పాలైంది. సుదీర్ఘంగా తొమ్మిదేళ్ల పాటు సాగిన కారు పాలనకు బ్రేక్ పడింది. ఇక ఓటమి తరువాత గులాబీ బాస్ చంద్రశేఖర్ రావు తొలిసారి స్పందించారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఓటమి పాలైంది. సుదీర్ఘంగా తొమ్మిదేళ్ల పాటు సాగిన కారు పాలనకు బ్రేక్ పడింది. ఇక ఓటమి తరువాత గులాబీ బాస్ చంద్రశేఖర్ రావు తొలిసారి స్పందించారు.

ఓటమిపై తొలిసారి స్పందించిన  బీఆర్ఎస్ అధినేత KCR!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగాయి. నెల రోజుల పాటు సాగిన ఈ ఎన్నికల కరుక్షేత్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక హ్యాట్రిక్ కొట్టాలని ఆశలు పెట్టుకున్న గులాబీ పార్టీకి ఓటమి ఎదురైంది. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అయితే గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రం ఇప్పటి వరకు ఎన్నికల ఫలితాలపై స్పందించలేదు. అయితే ఓటమి తరువాత తొలిసారిగా సోమవారం కేసీఆర్ స్పందించారు.

తెలంగాణలో జరిగిన 3వ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం విజయబావుట ఎగిరెసింది. ఇక బీఆర్ఎస్ ఊహించని ఫలితాన్నిఅందుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 64 సీట్లు, బీఆర్ఎస్ కు39 సీట్లు వచ్చాయి. అలానే బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజదుంధూబి మోగించిన.. గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం అడుగు పెట్టలేకపోయింది. ఇక్కడ కారు జెడ్ స్పీడ్ తో దూసుకెళ్లింది. హైదరాబాద్ పరిధిలోని 14 స్థానాల్లో కారు విజయం సాధించింది.

బీఆర్ఎస్ కి ఊరట ఇచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే.. అది హైదరాబాద్ పరిధిలో వచ్చిన సీట్లే. మొత్తంగా హ్యాట్రిక్ కొట్లాలని ఎన్నో ఆశలతో ఉన్న కారుకు.. కాంగ్రెస్ బ్రేకులు వేసింది. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ కి పంపారు. ఆదివారం అసెంబ్లీ ఫలితాలు విడుదలైతే.. కేటీఆర్ మీడియా సమావేశం పెట్టారు. ఎన్నికల ఫలితాలపై గులాబీ అధినేత కేసీఆర్ మాత్రం స్పందించలేదు. అయితే బీఆర్ఎస్ ఓటమి తరువాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  స్పందించారు.

సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చేనెల 16 వరకు మన ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కానీ ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నామని కేసీఆర్ తెలిపారు. నూతనంగా ఏర్పడే ప్రభుత్వానికి సహకరిద్దామని, ఏం జరుగుతుందో చూద్దామని ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ కేసీఆర్ అన్నారు. అతి త్వరలోనే తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశం నిర్వహించి.. ఫలితాలపై సమీక్ష చేద్దామని ఆయన తెలిపారు. అదేవిధంగా మన పార్టీ తరపున శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకుందామని ఆయన పేర్కొన్నారు. మరి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి