iDreamPost
android-app
ios-app

తల్లి ఆఫర్.. ఏడాదిలో 100 మందితో కూతురు డేటింగ్!

  • Author Soma Sekhar Published - 06:19 PM, Thu - 3 August 23
  • Author Soma Sekhar Published - 06:19 PM, Thu - 3 August 23
తల్లి ఆఫర్.. ఏడాదిలో 100 మందితో కూతురు డేటింగ్!

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడితేనే తల్లిదండ్రులు కోప్పడతారు. ఇక పిల్లలు ఎవరినైనా ప్రేమించాను అని చెప్తే.. తాట తీస్తారు పేరెంట్స్. అయితే కొన్ని ఇళ్లలో ఆలోచించి ప్రేమ పెళ్లి చేస్తారు. ఇక కొన్ని ఇళ్లలో అబ్బాయిలకు దూరంగా ఉండమని, వారితో మాట్లాడొద్దని కాలేజీ రోజుల నుంచే హితబోధ చేస్తుంటారు కొంతమంది పేరెంట్స్. కానీ ఓ తల్లి మాత్రం తన కూతురికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కూతురిని వంద మందితో డేటింగ్ చేయమని, అలా చేస్తే.. 500 డాలర్లు కూడా ఇస్తానని చెప్పింది. దాంతో రెచ్చిపోయిన కూతురు కేవలం ఏడాదిలోనే 100 మందితో డేటింగ్ చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బ్రిటన్ కు చెందిన ఓ తల్లి తన కూతురుకు బంపరాఫర్ ఇచ్చింది. ఒక్క సంవత్సరంలో వంద మందితో డేటింగ్ చేయ్యాలని, అలా చేస్తే.. 500 డాలర్లు ఖర్చుల కోసం ఇస్తానని ప్రకటించింది. దాంతో రెచ్చిపోయిన కూతురు కేవలం ఒక్క ఏడాదిలోనే 100 మందితో డేటింగ్ చేసింది. తన అందంతో యువకులకు గాలం వేసి ఒక్కరిద్దరు కాకుండా ఏకంగా 100 మంది బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేసింది. దాంతో తన తల్లి ప్రకటించిన 500 డాలర్లను కూడా గెలుచుకుంది. ఈ విషయాన్ని సదరు యువతి సోదరి ఎలిస్ కేరొలీన్ టిక్ టాక్ లో షేర్ చేసింది. దాంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా.. తల్లి ఇచ్చిన టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినందుకుగాను తన కూతురికి గ్రాండ్ వేడుక జరిపింది ఆ తల్లి. కేక్ పై 100 నెంబర్ క్యాండిల్ తో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా.. కన్నతల్లి అయ్యుండి కూతురిని డేటింగ్ కు పంపడం ఏంటి ని తల్లిని ప్రశ్నించగా.. పెళ్లి తర్వాత తన కూతురికి ఈ సమాజంలోని మగాళ్ల పట్ల భయం, అనుమానం ఉండకూడదని ఇలా చేయమని చెప్పాను అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో అందరు ఆశ్చర్యపోయారు. మరి కన్న తల్లి కూతురిని డేటింగ్ పంపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: నాకు పెళ్లైంది..కోపం రాదు.. రాజ్యసభలో నవ్వులు పూయించిన ఛైర్మన్!

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş