iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTTలోకి వచ్చేస్తోన్న బ్రహ్మానందం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

  • Published Apr 16, 2024 | 12:05 PM Updated Updated Apr 16, 2024 | 12:05 PM

Brahmanandam:

Brahmanandam:

  • Published Apr 16, 2024 | 12:05 PMUpdated Apr 16, 2024 | 12:05 PM
డైరెక్ట్ గా OTTలోకి వచ్చేస్తోన్న బ్రహ్మానందం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

బ్రహ్మానందం ఈ పేరు వినగానే.. మనకు తెలియకుండానే పెదవుల మీదకు నవ్వు వచ్చి చేరుతుంది. ఎంత బాధలో ఉన్నా సరే.. బ్రహ్మానందం కామెడీ చూస్తే రిలీఫ్ వస్తుంది. కమెడియన్ గా వందల చిత్రాల్లో నటించి.. ఏళ్ల తరబడి ప్రేక్షకులను నవ్వించారు. దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాసుకునే వారు అంటే బ్రహ్మీ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో హీరోలకు సమానంగా ప్రాధాన్యత దక్కించుకున్నాడు. ఇక మీమర్స్ బ్రహ్మీని వాడినట్లుగా ఏ కమెడియన్ ను వాడలేదు. వయసు పైబడటం, అనారోగ్యం వంటి కారణాల వల్ల కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా కీడాకోలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో బ్రహ్మీ నటించిన కామెడీ సినిమా ఒకటి నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

ఈమధ్య కాలంలో ఎక్కువగా కామెడీ చిత్రాలే విడుదలవుతున్నాయి. థియేటర్లోనే కాదు.. ఓటీటీల్లో కూడా ఇదే పంథా నడుస్తోంది. వీటిల్లో కొన్ని సినిమాలు అనుకోని రీతిలో అనూహ్య విజయం సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో కామెడీ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అయ్యింది. ప్రియమణి భామకలాపం నిర్మాతలు బీ బాపినీడు, సుధీర్ ఈదర.. వీరాంజనేయులు విహారయాత్ర పేరుతో కామెడీ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.

వీరాంజనేయులు విహారయాత్ర సినిమాలో ప్రముఖ కమెడీయన్ బ్రహ్మనందంతో పాటుగా సీనియర్ యాక్టర్ నరేష్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కీడాకోలా ఫేమ్ రాగ్‌మయూర్‌, ప్రియా వడ్లమాని ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. రోడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఇటీవలే సినిమా టీజర్, పోస్టర్స్ విడుదల చేసి.. మూవీపై ఆసక్తిని పెంచారు.

పాతకాలం నాటి వ్యాన్‌లో ఈ టూర్ సాగనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. వ్యాన్‌పైన లగేజీతో పాటు అస్తికలతో కూడిన చిన్న కుండ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇక త్వరలోనే ఈటీవీ విన్ ఓటీటీలో ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetfenomenbet girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom