iDreamPost

ఊహకందని విషాదం.. బాలుడి ప్రాణం తీసిన క్రికెట్ బాల్

వర్షం రాకడ, ప్రాణం పోకడ చెప్పలేమని అంటుంటారు పెద్దలు. నిజమే కొన్ని సార్లు ఈ రెండింటిని అంచనాలు కూడా వేయలేం. ఊహించని ప్రమాదాలు ఊపిరి తీస్తున్నాయి. తాజాగా క్రికెట్ బంతి ఆ ఇంట్లో ఎంతటి విషాదాన్ని నింపిందంటే..?

వర్షం రాకడ, ప్రాణం పోకడ చెప్పలేమని అంటుంటారు పెద్దలు. నిజమే కొన్ని సార్లు ఈ రెండింటిని అంచనాలు కూడా వేయలేం. ఊహించని ప్రమాదాలు ఊపిరి తీస్తున్నాయి. తాజాగా క్రికెట్ బంతి ఆ ఇంట్లో ఎంతటి విషాదాన్ని నింపిందంటే..?

ఊహకందని విషాదం.. బాలుడి ప్రాణం తీసిన క్రికెట్ బాల్

ఊహించని ప్రమాదాలు మనుషుల జీవితాలతో ఆటలాడుతున్నాయి. కుటుంబాల్లో విషాదాలను నింపుతున్నాయి. సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు తిరిగి రాని లోకాలకు తరలివెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగిల్చి, వారి ఆశలను సమాధి చేస్తున్నాయి అనుకోని ప్రమాదాలు. ఎవరిదీ తప్పు అని ప్రశ్నించేందుకు వీలు లేని విధంగా ఇలాంటి యాక్సిడెంటల్ సంఘటనలు జరుగుతున్నాయి. సరదాగా స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లిన ఓ చిన్నారి అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ సనత్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు కార్తీకేయ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకునేందుకు సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లాడు.

స్నేహితులంతా సరదాగా ఆడుకుంటున్నారు. కార్తీకేయ ఫీల్డింగ్ చేస్తున్నాడు. మరో బాలుడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంతలో మరో స్నేహితుడు బాల్ వేయడంతో.. బ్యాట్ పట్టుకున్న బాలుడు దాన్ని బలంగా కొట్టాడు. ఆ బంతి పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ స్మిమ్మింగ్ పూల్‌లో పడింది. ఆ బాల్ తీసుకు వచ్చే బాధ్యతను కార్తికేయకు అప్పగించారు తోటి ఫ్రెండ్స్. ఎత్తుగా ఉన్న స్విమ్మింగ్ పూల్ దూకాడు కార్తీకేయ. ఎంతకు బాల్ తీసుకు రాలేదు. అరిచి అరిచి.. ఎంతకు స్పందన రాకపోవడంతో.. వాళ్లంతా ఇంటికి వెళ్లిపోయారు. అంతలో తల్లిదండ్రులు అతడి కోసం వెతకసాగారు. చూడగా.. స్మిమ్మింగ్ పూల్‌లో శవమై కనిపించాడు. అతడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.

బహుశా బాల్ ఆ పూల్‌లో పడిపోవడంతో తీసేందుకు దిగాడా లేక.. ఆ నీటిలో ఆడుకునేందుకు దిగి.. నీట మునిగాడన్న అని అనుమానిస్తున్నారు పోలీసులు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కార్తీకేయ మరణాన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. సోమవారం స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేసి ఉండటంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. కార్తీకేయ లేడని తెలిసి.. అతడితో ఆడుకున్న స్నేహితులు సైతం కన్నీరుమున్నీరు అవుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. కొడుకు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు.. అతడి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోతున్నారు.  కేసు నమోదు చేసిన పోలీసులు.. మరింత విచారణ చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి