iDreamPost
android-app
ios-app

OTTలో అదిరిపోయే మూవీ.. ఒక్కో ట్విస్టు సీటు అంచున కూర్చోబెడుతుంది!

Tapsee Best Revange Drama: ఓటీటీలో ఉన్న సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ అండ్ రివేంజ్ డ్రామా అని చెప్పచ్చు. మరి.. మీరూ కూడా ఓసారి చూసేయండి.

Tapsee Best Revange Drama: ఓటీటీలో ఉన్న సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ అండ్ రివేంజ్ డ్రామా అని చెప్పచ్చు. మరి.. మీరూ కూడా ఓసారి చూసేయండి.

OTTలో అదిరిపోయే మూవీ.. ఒక్కో ట్విస్టు సీటు అంచున కూర్చోబెడుతుంది!

ఒక మంచి సినిమా చూడాలి అని అందరికీ ఉంటుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఓపెన్ చేస్తే.. బొచ్చడు సినిమాలు కనిపిస్తాయి. కొన్ని సినిమాలు పోస్టర్స్ సూపర్ ఉంటాయి.. కానీ, స్టార్ట్ చేసిన కాసేపటికి బోర్ కొట్టేస్తుంది. ఇంకొన్ని ట్రైలర్ కూడా అదిరిపోతుంది.. కానీ, సినిమా మాత్రం సప్పగా సాగుతుంది. ఓటీటీల్లో సినిమాలు చూసే వారికి కనీసం ఒక్కసారి అయినా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. అందుకే చాలామంది ఎవరో ఒకరు బాగుంది అని చెప్పిన సినిమాలను మాత్రమే చూస్తారు. అలాంటి వారి కోసం మేము ఒక లవ్ అండ్ రొమాన్స్ డ్రామాని తీసుకొచ్చాం. మీరు గనుక ఈ సినిమా ఇప్పటికీ చూడకపోతే ఒక మంచి థ్రిల్లర్ ని ఇన్ని రోజులు మిస్ అయ్యారనే చెప్పాలి.

మేము ఇంత హైప్ ఇస్తోంది.. తాప్సీ పన్ను- విక్రాంత్ మస్సె ప్రధాన పాత్రల్లో నటించిన హసీన్ దిల్ రుబా చిత్రం గురించే. ఈ మూవీ తాప్సీ పన్ను కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. ఈ చిత్రం జులై 2, 2021లో నెట్ ఫిల్క్స్ లో విడుదలైంది. ఆ ఏడాది మోస్ట్ వాచ్డ్ హిందీ ఫిల్మ్ గా నెట్ ఫ్లిక్స్ లో రికర్డులు సృష్టించింది. 22 దేశాల్లో టాప్ 10లో ఈ మూవీ నిలిచింది. ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ఇది ఒక బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా అనచ్చు. తాప్సీ కూడా ఈ సినిమాలో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇందులో లవ్, రొమాన్స్, డ్రామా, రివేంజ్, ఇల్లీగల్ అఫైర్ ఇలా.. అన్నీ కోణాలు సమపాళ్లలో ఉంటాయి. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేస్తాయి.

హీరో విక్రాంత్ మస్సై నటన కూడా టాప్ నాట్చ్ ఉంటుంది. ఒక భర్తగా అతను పడే తపన, అతని ప్రేమ, భార్య కోసం అతను చేసిన సాహసం అన్నీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. బయట వాళ్లు కాకుండా.. సొంత వాడే తమ జీవితాల్లోకి తొంగి చూసి తమను నానా ఇబ్బంది పెట్టాడని తెలుసుకుని విక్రాంత్ మస్సై తీసుకున్న నిర్ణయం అందరినీ కంగారు పెడుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బోలెడు ట్విస్టులు ఉంటాయి. మూవీ సెకండాఫ్ అయితే మరింత ఉత్కంఠగా సాగుతుంది. మూవీ స్కేల్ కార్డియల్ పైపైకి వెళ్తూ ఉంటుంది. క్లైమ్యాక్స్ వచ్చేసరికి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తారు. ప్రేమించిన భార్య కోసం ఇంత త్యాగానికి కూడా వెనుకాడరా అనే ప్రశ్న ఎదురవుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, తాప్సీ- విక్రాంత్ నటన ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తైనట్లు తాప్సీ నెల క్రితం ప్రకటించింది. ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా అనే టైటిల్ తో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ డ్రామాగా ఈ మూవీ అలరించనుంది.

కథ ఏంటంటే?:

రిషబ్(విక్రాంత్)- రాణీ సక్సేనా(తాప్సీ పన్ను)కి పెద్దలు పెళ్లి చేస్తారు. అయితే ఆ పెళ్లి రాణీకి ఇష్టం ఉండదు. తన భర్త మోడ్రన్ గా ఉండాలి అనుకుంటుంది. రిషబ్ మాత్రం కాస్త పద్ధతిగా, హోమ్లీగా ఉంటాడు. అది భార్యకు నచ్చక.. దూరంగానే ఉంటుంది. కానీ, భర్త తనపై చూపించే ప్రేమను మాత్రం అర్థం చేసుకోలేకపోతుంది. అది అర్థమయ్యే సమయానికి తన లైఫ్ లో దిద్దుకోలేని తప్పు చేసేస్తుంది. ఆ తప్పు ఏంటి? తాప్సీ చేసిన ఆ తప్పుని రిషభ్ క్షమిస్తాడా? తాప్సీ తిరిగి భర్తతో కలిసి జీవించాడనికి రెడీ అవుతుందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. మీరు నెట్ ప్లిక్స్ లో అందుబాటులో ఉన్న హసీన్ దిల్ రుబా మూవీ చూడాల్సిందే. మరి.. హసీన్ దిల్ రుబా మూవీ చూడాలి అనుకుంటున్నారా? ఇప్పటికే చూసేసుంటే మాత్రం ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbet