iDreamPost

రాబోయే 30-40 ఏళ్లు మావే, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వ‌స్తాం, అమిత్ షా

రాబోయే 30-40 ఏళ్లు మావే,  తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వ‌స్తాం, అమిత్ షా

రాబోయే 30- 40 ఏళ్లు బీజేపీ యుగమ‌ని, భారతదేశం ‘విశ్వ గురువు’ అవుతుందని బీజేపీ సీనియర్ నేత, హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని షా ప్ర‌తిపాదించారు. వార‌స‌త్వ రాజ‌కీయాలు, కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలు” “మహా పాపాలుగా మారి దేశం కష్టాలకు కార‌ణ‌మైయ్యాయ‌ని విమ‌ర్శించారు. రీజ‌న‌లిజం, కుటుంబ ఆధిపత్య రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికేందుకు అభివృద్ధి, పనితీరుపై దృష్టి పెట్టాలని రాజకీయ తీర్మానం పేర్కొంది.

ఆ త‌ర్వాత తెలంగాణ కార్య‌క‌ర్త‌లకు ఊపునిచ్చేలా మాట్లాడారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో కుటుంబ పాలనను బీజేపీ ఓడిస్తుంద‌ని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ మీద విమ‌ర్శ‌లు ద‌ట్టించారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ. అధికారం ఫ్యామిలీకి ద‌క్క‌ద‌న్న భ‌యంతోనే, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేద‌ని కామెంట్ చేశారు

విప‌క్షం క‌కావిక‌ల‌మైంది, కాంగ్రెస్ నేత‌లు తమ పార్టీలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నార‌ని అమిత్ షా అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి