iDreamPost

PM Modi: గేమర్లతో ప్రధాని మోదీ భేటీ! మీరు గేమర్స్ అయితే.. ఇక లైఫ్ సెట్!

  • Published Apr 13, 2024 | 3:08 PMUpdated Apr 13, 2024 | 3:08 PM

దేశంలో ఏటా లక్షల సంఖ్యలో డిగ్రీలు పట్టుకుని స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. మరి అంత మందికి ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయి. కాబట్టి ఇప్పుడు మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని.. జనరేషన్ కు తగినట్లే గేమింగ్ టెక్నాలజీని డెవలప్ చేసే దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తుంది.

దేశంలో ఏటా లక్షల సంఖ్యలో డిగ్రీలు పట్టుకుని స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. మరి అంత మందికి ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయి. కాబట్టి ఇప్పుడు మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని.. జనరేషన్ కు తగినట్లే గేమింగ్ టెక్నాలజీని డెవలప్ చేసే దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తుంది.

  • Published Apr 13, 2024 | 3:08 PMUpdated Apr 13, 2024 | 3:08 PM
PM Modi: గేమర్లతో ప్రధాని మోదీ భేటీ! మీరు గేమర్స్ అయితే.. ఇక లైఫ్ సెట్!

ప్రతి ఏటా దేశంలో లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులై బయటకు వస్తున్నారు. కానీ వారిలో కేవలం కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. దానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి. ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సిందేనా అంటే.. ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో డెవలప్ అవుతూ వస్తుంది. మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుంటూ.. జెనెరేషన్ కు తగినట్లే కొత్త ఉద్యోగాలను సృష్టించే దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలో కొత్త తరహా ప్రోత్సాహానికి నరేంద్ర మోడీ శ్రీకారం చుడుతూ.. ఇండియాలోని కొంతమంది యువతతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఆ యువత అంతా కూడా ఇండియాలోని ప్రముఖ గేమర్స్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి యువత వరకు ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడుతూనే ఉంటారు. ముఖ్యంగా యువత ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని.. ఎన్నో గేమ్స్ ను ఆడుతున్నారు. నూటికి తొంబై శాతం మంది తరచూ మొబైల్స్ లో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. కాబట్టి దీని నుంచే యువతకు ఉపయోగపడేలా.. గేమింగ్ రంగంలో సరైన ప్రోత్సాహాన్ని అందించి.. యువత బంగారు భవిష్యత్తుకు పునాది వేసే దిశగా నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలోని ప్రముఖ గేమర్స్ తో.. తాజాగా పీఎంవో కార్యాలయంలో చర్చలు జరిపారు. అక్కడ స్పెషల్ వీఆర్ గేమింగ్ సెటప్ ను ఏర్పాటు చేసి.. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ను వారందరి నుంచి సేకరించారు. అంతే కాకుండా వారితో కలిసి.. కొన్ని గేమ్స్ కూడా ఆడారు. ఆ తర్వాత గేమింగ్ రంగాన్ని భవిష్యత్తులో యువతకు ఉపయోగ పడేలా ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయాలను వారందరితో చర్చించారు. అందుకు సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతే కాకుండా ఈ సందర్భంలో అక్కడకు వచ్చిన యువత.. ఈ విషయంపై స్పందిస్తూ.. నరేంద్ర మోడీ ఇటువంటి కొత్త తరహా ఆలోచనలకు పునాది వేస్తున్నందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమాజం డిజిటల్ యుగంగా మారిపోతున్న క్రమంలో ఇలాంటి కొత్త ఆవిష్కరణలు.. యువతకు ఎంతో మేలు చేస్తాయంటూ పేర్కొన్నారు. ఇండియాలో ఇప్పుడు గేమింగ్ కు ఆదరణ బాగా పెరుగుతుందని.. రానున్నరోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని.. మరికొంతమంది ట్రైనీ గేమర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా.. ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. అలాగే ఇలాంటి వాటిని ప్రోత్సహించడంలో కేంద్రం ఎప్పుడు ముందుంటుందని హామీ ఇచ్చారు నరేంద్ర మోడీ. మరి ఇండియాలో గేమింగ్ విధానాన్ని డెవలప్ చేయండంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి