iDreamPost

మస్క్ కు అండగా మోదీ సర్కార్.. ఆ నిర్ణయం అంబానీకి ఇది పెద్ద దెబ్బే!

Elon Musk- Starlink: ఎప్పటి నుంచో ఇండియాలో తన వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్న ఎలాన్ మస్క్ కి ఎట్టకేలకు అనుమతులు దక్కాయి. కేవలం ఒక్క అడుగు దూరంలో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ కంపెనీ ఉంది. ఈ అనుమతులు ఇప్పుడు అంబానీని కాస్త ఇరకాటంలో పెట్టేటట్లు కనిపిస్తోంది.

Elon Musk- Starlink: ఎప్పటి నుంచో ఇండియాలో తన వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్న ఎలాన్ మస్క్ కి ఎట్టకేలకు అనుమతులు దక్కాయి. కేవలం ఒక్క అడుగు దూరంలో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ కంపెనీ ఉంది. ఈ అనుమతులు ఇప్పుడు అంబానీని కాస్త ఇరకాటంలో పెట్టేటట్లు కనిపిస్తోంది.

మస్క్ కు అండగా మోదీ సర్కార్.. ఆ నిర్ణయం అంబానీకి ఇది పెద్ద దెబ్బే!

ప్రపంచ అగ్ర కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో తన వ్యాపారాలను భారదేశంలో విస్తరించాలని ఉవిళ్లూరుతున్నారు. కానీ, ఆయనకు దాదాపుగా కొన్నాళ్లుగా భారత ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం లేదు. కానీ, ఇటీవల ప్రధాని మోదీని ఇండియాలో కలవబోతున్నాను అంటూ మస్క్ ప్రకటించిన తర్వాత మోదీ ప్రభుత్వం నుంచి మస్క్ కు గుడ్ న్యూస్ అందింది. ఆయన స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు సంబంధించిన ప్రిన్సిపుల్ పర్మిషన్స్ ని పొందాడు. ప్రస్తుతం మస్క్ వ్యాపారానికి సంబంధించిన అనుమతులకు సంబంధించి సెక్యూరిటీ చెక్ జరుగుతోంది. ఈ అనుమతులు అనీల్ అంబానీకి పెద్ద దెబ్బ అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఎలాన్ మస్క్ ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే అతనికి అనుమతుల విషయంలో చానాళ్లుగా మొండిచేయ తప్పడం లేదు. కానీ, ప్రధానితో భేటీకి ముందు స్టార్ లింక్ బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్ సేవలకు సంబంధించి ముందుస్తు అనుమతులు అందాయి. మూడున్నరేళ్లుగా టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి స్టార్ లింక్ సంస్థ ఎదురుచూస్తున్న అనుమతులు తాజాగా అందాయి. కీలకమైన వ్యాపార అనుమతులకు సంబంధించి ఒక పెద్ద అడ్డంకిని మస్క్ దాటేశారు. అయితే ప్రస్తుతం కొన్ని భద్రతా పరమైన అంశాల విషయంలో హోంమంత్రిత్వ శాఖ తుది పరిశీలన చేయాల్సి ఉంది. వాణిజ్య భాగస్వామ్యం, విదేశీ పెట్టుబడులు, సాంకేతిక అవసరాలు, నికర విలువలు వంటి అంశాలను పరిశీలించారు.

కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన డిక్లరేషన్ ని కూడా సమర్పించారు. ఇంకా స్టార్ లింక్ కంపెనీకి భారత భూభాగాన్ని సరిహద్దుగా కలిగిన దేశాల నుంచి కంపెనీకి ఎలాంటి వాటాదారులు లేరని నిర్ధారించుకోవాల్సి ఉంది. అలాగే స్టార్ లింక్ సేవలకు సంబంధించి భారత ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేసింది. అవేంటంటే.. వినియోగదారుల కేవైసీ వివరాలు దేశం దాటి పోకూడదు. బయటి దేశం సర్వర్లకు ఈ వివరాలను తరలించకూడదు. భద్రతా పరమైన అంశాలకు సంబంధించి ఉపగ్రహాల నుంచి వచ్చే శాటిలైట్ బీమ్ లు తప్పకుండా ఇండియాలోనే ల్యాండ్ కావాలి. విదేశీ తీరాలకు ఉపగ్రహ కదలికల ద్వారా చేరుకోకూడదు. ఆ తర్వాత జీఎంపీసీఎస్ సేవల లైసెన్స్ ద్వారా అనుమతులు పొందుతారు. ఇప్పటికే ఎయిర్ టెల్, జియో సంస్థలు ఈ తరహా అనుమతులు పొంది ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాపారంలోకి స్టార్ లింక్ అడుగుపెడుతోంది అంటే అంబానీకి ఇది వ్యాపారం పరంగా దెబ్బ అనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి