మరికొన్ని రోజుల్లో దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ప్రణాళికలు వేస్తున్నారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్ అసెంబ్లి ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. అందులో ఒకరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ. తనకు టికెట్ రావడంపై అలాగే ప్రజలను ఓట్లు అడగడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రజలను ఓట్లు అడిగే విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ వర్గీయ. తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్ లో ఈయన పేరు కూడా ఉంది. లిస్ట్ లో తన పేరు ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు విజయ్ వర్గీయ. తనకు అసలు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశమే లేదని, టికెట్ వచ్చినందుకు సంతోషంగా లేనని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో పాటుగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. నేను చాలా పెద్ద లీడర్ ను అయినందున ప్రజల ముందు వంగి దండం పెట్టి ఓట్లు అడగడం నాకు నచ్చదని, వారిని అలా ఓట్లు అడగలేనని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం విజయ్ వర్గీయ చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని , పార్టీ ఆశలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని కైలస్ విజయ వర్గీయ చెప్పుకొచ్చాడు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను ఓట్లు అడగడం సర్వసాధారణమైన విషయమని అందరికీ తెలిసిందే. మరి ప్రజల ముందు చేతులు కట్టుకుని ఓట్లు అడగాలా? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.