iDreamPost

బీజేపీని పూర్తిగా కరుణించని శ్రీరాముడు! అయినా.. పట్టాభిషేకం పక్కా!

  • Published Jun 04, 2024 | 5:47 PMUpdated Jun 04, 2024 | 5:49 PM

Faizabad, Uttar Pradesh, Ayodhya, Ram Mandir: ఈ లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి బాగా కలిసి వస్తుంది అనుకున్న రామ మందిరం పెద్దగా ప్రభావం చూపలేదు. అయోధ్య ఉన్న నియోజకవర్గంలోనే బీజేపీ వెనుకంజలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Faizabad, Uttar Pradesh, Ayodhya, Ram Mandir: ఈ లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి బాగా కలిసి వస్తుంది అనుకున్న రామ మందిరం పెద్దగా ప్రభావం చూపలేదు. అయోధ్య ఉన్న నియోజకవర్గంలోనే బీజేపీ వెనుకంజలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jun 04, 2024 | 5:47 PMUpdated Jun 04, 2024 | 5:49 PM
బీజేపీని పూర్తిగా కరుణించని శ్రీరాముడు!  అయినా.. పట్టాభిషేకం పక్కా!

ఈ సారి ఎన్నికల్లో బీజేపీని అయోధ్య రామమందిరం భారీ మెజార్టీతో మూడోసారి ఢిల్లీ పీఠం అందిస్తుందని చాలా మంది భావించారు. ఎందుకంటే.. అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే చాలా ఏళ్ల నాటి డిమాండ్‌ను బీజేపీ ప్రభుత్వం హయాంలో నెరవేర్చింది. దీంతో.. ఆ పార్టీ ఓట్ల పంట పండుతుందని చాలా మంది అంచనా వేశారు. కానీ, రామ మందిరంతో పాటు భారీ పెరిగిన ధరలను కూడా ఈసారి ఓటర్లు దృష్టిలో పెట్టుకున్నట్లు ఉన్నారు. అందుకే.. అయోధ్య రామ మందిరం కూడా బీజేపీకి అంతగా కలిసిరాలేదు. అందుకు స్పష్టమైన ఉదాహరణే.. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉండటం.

దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నా.. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉండటం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న 80 స్థానాల్లో ఇండియా కూటమి 41 స్థానాల్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ 34, కాంగ్రెస్ 7 సీట్లలో లీడ్‌లో ఉన్నాయి. గతంలో ఇదే ఉత్తరప్రదేశ్‌లో 64 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో.. యూపీ బీజేపీకి బలమైన రాష్ట్రంగా ఉంది. కానీ, ఈ సారి మాత్రం 35 సీట్లకే బీజేపీ పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా బీజేపీ నేతృత్వంలోని ఇండియా కూటమి 297 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుండగా.. ఇండియా కూటమి 228 సీట్లలో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇక ఇతరులు 18 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ఎన్నికలకు ముందు హడావిడిగా రామాలయం పూర్తి కాకుండా ముందే.. బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అంటూ ఆరంభం వేడుకలు నిర్వహించారు. ఇది ఎన్నికల కోసమే చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. అయినా కూడా అయోధ్య రామాలయం బీజేపీకి కలిసి వస్తుందని.. దేశంలో 400 కు పైగా సీట్లు సాధించేందుకు అవకాశం ఉందనే అభిప్రాయాలను వ్యక్తం అయ్యాయి. కానీ, అది పెద్దగా ప్రభావం చూపలేదని స్పష్టంగా తెలుస్తోంది. అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉండటం గమనార్హం. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 3500 ఓట్లకుపైగా మెజార్టీలో కొనసాగుతున్నారు. బీజేపీ తరఫున బరిలో నిలిచిన లల్లూ సింగ్ రెండో స్థానంలో వెనుకంజలో ఉన్నారు. అయితే.. బీజేపీని శ్రీరాముడు అంతగా కరుణించలేదని.. వాళ్లు ఆశించిన 400 సీట్లు ఇవ్వలేదు కానీ.. అధికారం మాత్రం పోకుండా చూశాడంటూ సోషల్‌ మీడియాలో సరదా కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి