iDreamPost

అనుపమకు చేదు అనుభవం.. రెండేళ్లు సినిమాలకు దూరం!

అనుపమకు చేదు అనుభవం.. రెండేళ్లు సినిమాలకు దూరం!

ఒత్తైన కురులు, చంపలు చారేసి కళ్లు, ఒద్దికైన రూపం ఆ నటి సొంతం. ఇక యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇర్రగదీస్తుంది. ఇంతకు ఆమె ఎవరునుకుంటున్నారు కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో తెలుగు వాకిట్లోకి అడుగుపెట్టిన ఈ మాలీవుడ్ కుట్టీ..అనతి కాలంలో మంచి పేరు తెచ్చుకుంది. శర్వానంద్, రామ్, శ్రీ విష్ణు, నాని, సాయి ధరమ్ తేజ్, నితిన్,  వంటి యంగ్ టాలెంట్స్‌ పక్కన నటించిన ఆమె ఇప్పుడు మరో యంగ్ సంచలనం సిద్దు జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్‌లో నటిస్తోంది. ఇప్పుడు ఒకలెక్కా.. ఇప్పుడు నుండి మరో లెక్కలా.. ఈ సినిమాలో కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లు.. విడుదలైన సాంగ్స్‌లో కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తనకు చాలా కోపమని, ఆఆ మూవీలో నాగవల్లి లెక్కన అన్నమాట అంటూ చెప్పారు. కోపం వస్తే ఫటాఫట్ అనేస్తానని, కాసేపు అదే మూడ్‌లో ఉంటానని చెప్పారు. కొన్ని సార్లు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతానని తెలిపారు. అరగంటలకు మళ్లీ సెట్ అయిపోయి.. ఆ విషయాన్ని మళ్లీ ప్రస్తావించనని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం ఫలానా రోజు ఇలా అన్నావని గొడవలు పెట్టుకోనని అన్నారు. అలాగే తనకు శాఖా హారం అంటే ఇష్టమని తెలిపారు. మాంసాహారం తింటాడని, అలాగే బాగా వండుతానని చెప్పుకొచ్చారు. అలాగే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కదా.. తన విషయంలో రివర్స్ అయ్యిందని చెప్పారు. ‘ మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’లో నాది చిన్నపాత్ర. మహా అయితే పదిహేను నిమిషాల నిడివి ఉంటుందేమో! అయితే, ఆ సినిమా విడుదలయ్యాక నా మీద చాలా ట్రోల్స్‌ వచ్చాయి’ అని తెలిపారు.

‘అయితే నాకు సినిమాల పరంగా, ఇండస్ట్రీ పరంగా అనుభవం లేకపోవడంతో చాలా సీరియస్ గా తీసుకున్నాను. ఇండస్ట్రీలో అనుభవం లేకపోవడంతో వాటన్నిటినీ చాలా సీరియస్‌గా తీసుకున్నా. చాలా రోజులు డిప్రెషన్‌లో ఉండిపోయా. అప్పుడే మళ్లీ మలయాళ చిత్రాల్లో నటించొద్దని డిసైడ్‌ అయిపోయా. రెండేళ్ల వరకు మాతృభాషలో సినిమా చేయలేదు. ఇప్పుడు అక్కడ మంచి ఆదరణ లభిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చిన సోషల్ మీడియా వినియోగించడంపై అవగాహన వచ్చింది. దేనికి రియాక్ట్ కావాలో లేదో తెలుసుకున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను. రెగ్యులర్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటాను’ అని తెలిపారు. అలాగూ ఆరోగ్యంగా అంటే శారీరకంగా ఫిట్ ఉండటమే కాదూ .. మానసికంగా కూడా బలంగా ఉంటాలని చెప్పారు. ఇప్పుడు విడుదలయ్యే టిల్లు స్క్వేర్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటానన్న ధీమా వ్యక్తం చేశారు అనుపమ.