iDreamPost

యానిమ‌ల్ మిషన్ గ‌న్ కి రూ.50 ల‌క్ష‌లు! ఇది సక్సెస్ మంత్ర!

  • Author Soma Sekhar Published - 03:26 PM, Tue - 28 November 23

యానిమల్ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ సినిమా లవర్స్ కు నిద్రపట్టనీయడం లేదు. అదేంటంటే? ఈ చిత్రంలో వాడిన భారీ మిషన్ గన్, దాని ధర. ఆ పెద్ద మిషన్ గన్ గ్రాఫిక్స్ కాదండోయ్.. దానిని 4 నెలలు కష్టపడి మనుషులే రెడీ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

యానిమల్ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ సినిమా లవర్స్ కు నిద్రపట్టనీయడం లేదు. అదేంటంటే? ఈ చిత్రంలో వాడిన భారీ మిషన్ గన్, దాని ధర. ఆ పెద్ద మిషన్ గన్ గ్రాఫిక్స్ కాదండోయ్.. దానిని 4 నెలలు కష్టపడి మనుషులే రెడీ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Published - 03:26 PM, Tue - 28 November 23
యానిమ‌ల్ మిషన్ గ‌న్ కి రూ.50 ల‌క్ష‌లు! ఇది సక్సెస్ మంత్ర!

యానిమల్.. ప్రస్తుతం ఈ పేరు ఇండియా వైడ్ గా వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ సైతం అభిమానుల ఆసక్తికి తగ్గట్లుగానే అప్టేడ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ కావడంతో.. యానిమల్ పై హైప్ విపరీతంగా పెరిగింది. ఈ వేడుకుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ మూవీ లవర్స్ కు నిద్రపట్టనీయడం లేదు. అదేంటంటే? యానిమల్ మూవీలో వాడిన భారీ మిషన్ గన్.

డైరెక్టర్లు తమ సినిమాల్లో ఏదైనా స్పెషాలిటీ ఉండాలని కోరుకుంటారు. కొందరు ఫైట్స్ వెరైటీగా డిజైన్ చేస్తే.. మరికొందరు మూవీలో వాడే ప్రాపర్టీస్ ను ప్రత్యేకంగా చూపించాలని భావిస్తూ ఉంటారు. ఇవి ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి సక్సెస్ ఫార్ములానే ఎన్నుకున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తాజాగా రిలీజ్ అయిన యానిమల్ మూవీ ట్రైలర్ చివర్లో ఓ మిషన్ గన్ ను రణ్ బీర్ వాడటం మీరు చూసే ఉంటారు. అయితే దాన్ని చూసి చాలా మంది గ్రాఫిక్స్ అని అనుకుని ఉంటారు. కానీ అది గ్రాఫిక్స్ గన్ కాదు. దాన్ని నాలుగు నెలలు కష్టపడి మనుషులే తయ్యారు చేశారు. ఈ గన్ కోసం అచ్చమైన స్టీల్ ను వాడారు. దీని బరువు దాదాపు 500 కేజీలు ఉంటుందని యానిమల్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇది డైరెక్టర్ సందీప్ విజన్ కు తార్కణంగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా.. దీని ఖరీదు అక్షరాలా రూ. 50 లక్షల రూపాయలట. సినిమాకి ఈ భారీ గన్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలవనుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ముంబైలో ఉంది. త్వరలోనే దీనిని హైదరాబాద్ కు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రధాన థియేటర్లలో ప్రేక్షకుల ప్రదర్శనార్థం దీనిని ఉంచాలని భావిస్తున్నారట మేకర్స్. దీంతో ప్రమోషన్ తో పాటుగా బిజినెస్ కూడా అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా.. ఒక సినిమా సక్సెస్ కావాలంటే దానికి అన్ని రకాల హంగులతో పాటుగా ఇలాంటి విజువల్ ఫీస్ట్ ఉంటే సక్సెస్ రేట్ మరికాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ పార్ములానే ఇప్పుడు యానిమల్ టీమ్ అనుసరిస్తోంది. ఇక మిషన్ గన్ల వాడకం కేజీఎఫ్, కేజీఎఫ్ 2, ఖైదీ, విక్రమ్, మార్క్ ఆంటోని మూవీల్లో ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకున్నాయో మనందరికి తెలిసిందే. మరి ఈ ఫైట్ థియేటర్లలో ఏ రేంజ్ పూనకాలు తెప్పిస్తో డిసెంబర్ 1 వరకు వేచి చూడాలి.  మరి 50 లక్షలు పెట్టి భారీ మిషన్ గన్ వాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి