iDreamPost
android-app
ios-app

OTTలో భోళా శంకర్ కు భారీ ధర! ఇదీ మెగాస్టార్ రేంజ్!

  • Author Soma Sekhar Updated - 11:33 PM, Thu - 2 November 23
  • Author Soma Sekhar Updated - 11:33 PM, Thu - 2 November 23
OTTలో భోళా శంకర్ కు భారీ ధర! ఇదీ మెగాస్టార్ రేంజ్!

భోళా శంకర్.. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. దాదాపు రూ. 110 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం తొలి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ప్రేక్షకులు మెగాస్టార్ సినిమా చూడ్డానికి అంతగా ఆసక్తి కనబరచట్లేదు. దీంతో మినిమమ్ కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది భోళా శంకర్. దీంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మరి ఇలాంటి డిజాస్టర్ మూవీని భారీ ధర పెట్టి దక్కించుకుంది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. దీంతో మెగాస్టార్ ఫ్లాప్ సినిమాకు కూడా ఈ రేంజ్ డిమాండ్ ఏంటి? అంటూ అవాక్కవుతున్నారు విశ్లేషకులు. ఇదీ మెగాస్టార్ రేంజ్ అంటూ.. అభిమానులు ఖుషి అవుతున్నారు.

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. తమన్నా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. దీంతో మెగాస్టార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దాదాపు రూ. 110 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం మినిమం కలెక్షన్లను కూడా రికవరీ చేయలేకపోయింది. ఇక తొలి షో నుంచే భోళా శంకర్ మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో.. థియేటర్ల వైపు వెల్లడానికి అంతగా ఆసక్తి కనబర్చలేదు ప్రేక్షకులు. దీంతో మెగాస్టార్ ఖాతాలో ఆచార్య తర్వాత మరో బిగ్గెస్ట్ ఫ్లాప్ చేరింది. ఇదిలా ఉంటే.. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న భోళా శంకర్ మూవీకి ఓటీటీలో మాత్రం భారీ ధర పలికింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ భోళా శంకర్ ఓటీటీ రైట్స్ ను ఏకంగా రూ. 30 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందట.

ఇక ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మెగాస్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో జయాపజయాలు కామన్ అని.. మూవీ ఫ్లాప్ అయినంత మాత్రం ఆయన స్థాయి దిగజారదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. అయితే థియేటర్లలో చూడని ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఓటీటీలో భోళా శంకర్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది అంటున్నారు నెటిజన్స్. అందుకే నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకు ఇంత ధర పెట్టిందని చెబుతున్నారు. మరి మెగాస్టార్ రేంజ్ చూపిస్తూ.. భారీ స్థాయిలో ఓటీటీ ధర పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఖరీదైన కారు కొన్న లోకేష్ కనగరాజ్.. ఎన్ని కోట్లంటే?