iDreamPost
android-app
ios-app

ఖరీదైన కారు కొన్న లోకేష్ కనగరాజ్.. ఎన్ని కోట్లంటే?

  • Author Soma Sekhar Published - 05:32 PM, Thu - 17 August 23
  • Author Soma Sekhar Published - 05:32 PM, Thu - 17 August 23
ఖరీదైన కారు కొన్న లోకేష్ కనగరాజ్.. ఎన్ని కోట్లంటే?

సెలబ్రిటీలకు కార్లన్నా, బైక్స్ అన్నా ఎంత ఇష్టమో మనందరికి తెలిసిందే. కొంత మంది హీరోలకు తమకు నచ్చిన కారు ఇంటికి తెచ్చుకునే దాక నిద్రపట్టదు. హీరోలకు గానీ, డైరెక్టర్లకు గానీ తమ దగ్గర ఎన్ని కార్లు ఉన్నా.. కొత్తగా మార్కెట్ లోకి వచ్చే కార్లను కొంటూనే ఉంటారు. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే లోకేష్ గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి వచ్చి చేరింది మరో న్యూ కార్. మరి దాని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. అతి తక్కువ కాలంలో పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు. 2017లో ‘మానగరం’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్.. వరుసగా సూపర్ స్టార్లతో సినిమాలు చేసి అగ్ర దర్శకుడిగా మారాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో తన రేంజ్ ఏంటో ఇండియా మెుత్తానికి తెలియజేశాడు. ప్రస్తుతం దళపతి విజయ్ తో ‘లియో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు లోకేష్. వీరి కాంబోలో ఇప్పటికే ‘మాస్టర్’ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక లియో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దాదాపు షూటింగ్ మెుత్తం పూర్తి అయినట్లే! యాక్షన్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న థియేటర్లలోకి రాబోతోంది. కాగా.. ప్రస్తుతం కోలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకడు. ఇక అతడికి కార్లంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇప్పటికే ఈ స్టార్ డైరెక్టర్ గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. తాజాగా అతడి గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చి చేరింది. లేటెస్ట్ వర్షన్ బ్లాక్ కలర్ BMW 7 సిరీస్ కారును కొనుగోలు చేశాడు లోకేష్. ఇక ఈ లగ్జరీ కారు ధర అక్షరాలా రూ. 1.70 కోట్లు. కాగా.. విక్రమ్ మూవీ భారీ విజయం సాధించిన తర్వాత కమల్ హాసన్ కూడా లోకేష్ కు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఇదికూడా చదవండి: నిహారిక పర్సనల్ లైఫ్ పై నెటిజన్ కామెంట్! స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తేజ్..

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis