iDreamPost

Bhimaa OTT: రేపే OTTలోకి గోపీచంద్ ‘భీమా’ ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Apr 24, 2024 | 4:02 PMUpdated Apr 26, 2024 | 6:18 PM

వరుసుగా థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్ నటించిన భీమా సినిమా కూడా ఓటీటీ లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

వరుసుగా థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్ నటించిన భీమా సినిమా కూడా ఓటీటీ లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

  • Published Apr 24, 2024 | 4:02 PMUpdated Apr 26, 2024 | 6:18 PM
Bhimaa OTT: రేపే OTTలోకి గోపీచంద్ ‘భీమా’ ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

చాలా కాలం తర్వాత గోపీచంద్ కు మంచి కమ్ బ్యాక్ ఇస్తుందనుకున్నారు భీమా సినిమా. కానీ అదే సమయంలో మరొక సినిమా కూడా రిలీజ్ అవ్వడంతో.. భీమా సినిమాకు కాస్త కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి తీరాలి. మార్చి 8 న భీమా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలైన మొదటి షో నుంచే భీమా సినిమా మిక్సెడ్ టాక్ ను సంపాదించుకుంది. దీనితో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి ఎంటర్ అయ్యేందుకు సిద్ధం అయిపొయింది. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే విషయాల గురించి చూసేద్దాం. ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ ను స్వయంగా హీరోనే ప్రకటించడం విశేషం.

భీమా సినిమాకు.. హర్ష దర్శకత్వం వహించారు. భీమా సినిమాతో తెలుగులో డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ చిత్రాన్ని భీమా చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై.. కెకె రాధామోహన్ నిర్మించారు. భీమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ సంస్థ హాట్ స్టార్ కొనుగోలు చేసిందట. అలాగే శాటిలైట్ రైట్స్‌ను బుల్లితెర టీవీ ఛానెల్ స్టార్ మా కొనుగోలు చేసిందట. ఓటీటీ అండ్ శాటిలైట్ హక్కులు అన్ని కలిపి మొత్తంగా రూ. 20 కోట్ల వరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. కాగా, భీమా సినిమాలో గోపీచంద్ కు జోడిగా మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్ లో మిక్సడ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమా ఏప్రిల్ 25 అర్ధరాత్రి నుంచి హాట్స్టార్ లో అందుబాటులోకి రానుంది.

కాగా భీమా సినిమా కథ విషయానికొస్తే.. ఈ చిత్రంలో భీమా, రామా అనే రెండు పాత్రలు చేశారు గోపీచంద్. భీమాగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో అలరించారు. పరశురామ క్షేత్రం ఉండే మహేంద్రగిరి అనే ప్రాంతంలో ఈ సినిమా కథ కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో అరాచకాలు చేసే ముఠాను గోపిచంద్ ఎలా పట్టుకుంటాడు!. అసలు పరుశురామ్ క్షేత్రం ఎందుకు మూతపడింది!.. మళ్లీ తెరుచుకుందా లేదా! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాలో గోపీచంద్ నటనకు మంచి ప్రశంసలే దక్కినా కానీ.. ఎందుకో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరి భీమా సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి