iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్‌ కేసరి.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

  • Published Nov 24, 2023 | 9:29 AM Updated Updated Nov 24, 2023 | 9:29 AM

ఇటీవల స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో మిస్ అయిన వారికి ఓటీటీ వేధిక మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలోకి తమ అభిమాన హీరోల చిత్రాలు రావడంతో ప్రేక్షకులు తెగ సంతోషంలో ఉంటున్నారు.

ఇటీవల స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో మిస్ అయిన వారికి ఓటీటీ వేధిక మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలోకి తమ అభిమాన హీరోల చిత్రాలు రావడంతో ప్రేక్షకులు తెగ సంతోషంలో ఉంటున్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్‌ కేసరి.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఈ మద్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనీల్ రావిపూడి గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’. యాక్షన్.. ఎమెషనల్, మెసేజ్ ఓరియెంటెడ్ ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 135 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ మూవీతో బాలయ్య హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. థియేటర్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. వివరాల్లోకి వెళితే..

గాడ్ మాసెస్.. నటసింహం నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల ముఖ్యపాత్రల్లో నటించిన ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ మూవీస్ కి పెద్ద పీట వేసే అనీల్ రావిపూడి.. కామెడీతో పాటు యాక్షన్, ఎమెషన్, మెసేజో ఓరియెంటెడ్ గా ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి బాలయ్య కెరీర్ లో ది బెస్ట్ మూవీ అయ్యింది. ఈ మూవీ థియేటర్లలో దుమ్మురేపింది.. ఇక బుల్లితెరపై సత్తా చాటేందుకు సిద్దమైంది. భగవంత్ కేసరి ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంది అమెజాన్ ప్రైమ్. ఈ నెల 24 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్లలో చూడని ప్రేక్షకులు, అభిమానులు ఓటీటీలో చూసే ఛాన్స్ దక్కడంతో తెగ సంతోషంలో ఉన్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న NBK109 మూవీ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు బాబీ. ఇటీవల మెగాస్టార్ చిరు, రవితేజ కలిసిన నటించిన వాల్తేరు వీరయ్య మూవీతో మంచి హిట్ అందుకున్నారు. బాలయ్యతో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమా బ్యానర్స్ లో భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది.. ప్రస్తుతం ఉటీలో కొనసాగుతుంది. బాలకృష్ణతో యాక్షన్ షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఈ చిత్రానికి రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ అందించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో బాలయ్యతో పాటు మాలీవుడ్ స్టార్ హీరో దుల్కన్ సల్మాన్ కూడా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కాకపోతే అఫిషియల్ గా మాత్రం అనౌన్స్ మెంట్ లేదు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş