iDreamPost
android-app
ios-app

ఇకపై కెప్టెన్సీకి దూరంగా హార్దిక్‌ పాండ్యా! BCCI మాస్టర్‌ ప్లాన్‌

  • Published Aug 21, 2023 | 12:00 PM Updated Updated Aug 21, 2023 | 12:00 PM
  • Published Aug 21, 2023 | 12:00 PMUpdated Aug 21, 2023 | 12:00 PM
ఇకపై కెప్టెన్సీకి దూరంగా హార్దిక్‌ పాండ్యా! BCCI మాస్టర్‌ ప్లాన్‌

టీమిండియాకు టీ20 ఫార్మాట్‌లో హార్ధిక్‌ పాండ్యా అప్రకటిత రెగ్యులర్‌ కెప్టెన్‌లా కొనసాగుతున్నాడు. ఐర్లాండ్‌ సిరీస్‌లో అతనికి రెస్ట్‌ ఇవ్వడంతో వెన్నుగాయం నుంచి కోలుకుని టీమ్‌లోకి తిరిగొచ్చిన బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 తర్వాత నుంచి పాండ్యానే టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే వన్డే జట్టులో రోహిత్‌ శర్మకు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. వన్డే వైస్‌ కెప్టెన్సీ నుంచి కేఎల్‌ రాహుల్‌ను తప్పించిన బీసీసీఐ.. పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. దీంతో పాండ్యానే టీమిండియా ఫ్యూచర్‌గా కెప్టెన్‌గా అంతా భావించారు.

కానీ, ఆది నుంచి పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా విజయాలు సాధిస్తున్నా.. కెప్టెన్‌గా పాండ్యా కరెక్ట్‌ కాదనే విమర్శలు చాలా వచ్చాయి. భావోద్వేగాలను అదుపుచేసుకోలేడని, బౌలింగ్‌ మార్పులు జరిగా చేయలేడని, స్వార్థం చూపిస్తాడని, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పిచ్చి ప్రయోగాలు చేస్తుంటాడని, ముఖ్యంగా అతను చేసే అతి భరించలేమంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పాండ్యా తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడంతో పాండ్యాపై వ్యతిరేకత మరింత ఎక్కువైంది.

దీంతో.. పాండ్యాను కెప్టెన్సీకి దూరంగా ఉంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. రానున్న ఆసియా కప్‌ 2023, వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో రోహిత్‌కు డిప్యూటీగా పాండ్యా స్థానంలో మరో ఆటగాడిని వైస్‌ కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20ల్లో పాండ్యాను కెప్టెన్‌గా కొనసాగించినా.. వన్డేల్లో మాత్రం వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించి, బుమ్రాను వన్డే వైస్‌ కెప్టెన్‌గా చేయాలని భావిస్తున్నారు. పాండ్యా ఫామ్‌లో లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. కేవలం వైస్‌ కెప్టెన్‌ అనే ట్యాగ్‌తో ఫామ్‌లో లేకపోయినా.. ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఫామ్‌లో లేని పాండ్యాను భరించడం జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. అందుకే.. ఈ మెగా టోర్నీలకు ముందుగానే పాండ్యాను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించి, ఐర్లాండ్‌తో సిరీస్‌లో అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్న సీనియర్‌ స్టార్‌ బౌలర్‌ బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా చేయాలని బీసీసీఐ బలంగా ఫిక్స్‌ అయినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీ20 కెప్టెన్‌గా బుమ్రా భేష్‌! పాండ్యా.. చూసి నేర్చుకోవాలి అంటూ..!