iDreamPost
android-app
ios-app

శ్రీలంక క్రికెట్​ను జై షా నాశనం చేశాడా? అర్జున రణతుంగ విమర్శల్లో నిజమెంత?

  • Author singhj Published - 07:06 PM, Tue - 14 November 23

బీసీసీఐ సెక్రటరీ జై షాపై శ్రీలంక దిగ్గజం అర్జున రణతుంగ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. లంక క్రికెట్ నాశనమవ్వడానికి షానే కారణమని ఆరోపించాడు రణతుంగ.

బీసీసీఐ సెక్రటరీ జై షాపై శ్రీలంక దిగ్గజం అర్జున రణతుంగ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. లంక క్రికెట్ నాశనమవ్వడానికి షానే కారణమని ఆరోపించాడు రణతుంగ.

  • Author singhj Published - 07:06 PM, Tue - 14 November 23
శ్రీలంక క్రికెట్​ను జై షా నాశనం చేశాడా? అర్జున రణతుంగ విమర్శల్లో నిజమెంత?

క్రికెట్​లో ఎన్ని టోర్నీలు ఉన్నప్పటికీ వరల్డ్ కప్​ కిందే ఏదైనా. జెంటిల్మన్ గేమ్​లో ఈ టోర్నమెంట్​ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆడే ప్రతి దేశం ఎదురు చూస్తుంది. మెగా టోర్నీలో సత్తా చాటి టీమ్​కు కప్​ను అందించాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. అయితే ఈ క్రమంలో గెలిచిన జట్టును ప్రేక్షకులు, అభిమానులు పొగడ్తల్లో ముంచెత్తుతారు. అదే వరల్డ్ కప్​లో ఓడిన టీమ్ అయితే మాత్రం ఫ్యాన్స్ నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు. అలాగే క్రికెట్ బోర్డుల నుంచి కూడా చర్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచ కప్​లో ఫెయిలైన టీమ్స్​కు సంబంధించిన కెప్టెన్లు, కోచ్​లు రాజీనామా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2007 వరల్డ్ కప్​లో గ్రూప్ దశలోనే టీమిండియా వెనుదిరగడంతో అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

2007 వరల్డ్‌ కప్​లోనే పాకిస్థాన్ కూడా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. దీంతో దాయాది జట్టులోనూ పలు మార్పులు చేశారు. 2015లో ఇంగ్లండ్ లీగ్ స్టేజ్​లోనే వెనుదిరిగింది. దీంతో టీమ్ మొత్తాన్ని మార్చేసింది ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు. ప్రస్తుత వరల్డ్ కప్​లోనూ కొన్ని టీమ్ పెర్ఫార్మెన్స్ తాలూకు ఎఫెక్ట్ టోర్నీ ముగియక ముందు స్టార్ట్ అయింది. ఈసారి మెగాటోర్నీలో లీగ్ స్టేజ్​లో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఏడింట్లో ఓడింది శ్రీలంక. దీంతో లంక గవర్నమెంట్ ఆ దేశ క్రికెట్ బోర్డు మొత్తాన్ని రద్దు చేసేసింది. టీమ్​లోనూ భారీ మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రూల్స్​కు విరుద్ధంగా బోర్డు వ్యవహారాల్లోకి దేశ సర్కారు జోక్యం చేసుకుందనే కారణంతో శ్రీలంక మీద నిషేధం విధించింది ఐసీసీ. ఎలక్షన్ ప్రొసీజర్​కు వ్యతిరేకంగా ప్రభుత్వం బోర్డును రద్దు చేయడంతో బ్యాన్​ను ఫేస్ చేస్తోంది లంక క్రికెట్.

లంక క్రికెట్​కు పట్టిన దుస్థితిపై క్రికెట్ ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్న తరుణంలో ఆ దేశ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. లంక క్రికెట్​కు ఈ గతి పట్టడానికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ప్రధాన కార్యదర్శి జై షానే కారణమని ఆరోపించాడు. లంక బోర్డు అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగానే షా తమ మీద పెత్తనం చెలాయిస్తున్నాడని విమర్శించాడు. తండ్రి అమిత్ షా పవర్​ను అడ్డుపెట్టుకొని జై షా శ్రీలంక క్రికెట్​ను శాసిస్తున్నాడని సీరియస్ అయ్యాడు.

జై షా వల్లే లంక క్రికెట్ నాశనమైందన్నాడు అర్జున రణతుంగ. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఆసియా కప్-2023 నిర్వహణ విషయంలో పాకిస్థాన్ నుంచి కొన్ని మ్యాచులు లంకలో జరిగేలా షా ఒప్పించాడని.. అంతవరకే గానీ ఆ దేశ క్రికెట్​లో ఆయన ప్రమేయం ఎక్కడా లేదంటున్నారు. లంక బోర్డుకు కాసులు కురిపించే లంక ప్రీమియర్ లీగ్​లోనూ షా వేలు పెట్టలేదని కామెంట్స్ చేస్తున్నారు. లంక క్రికెట్ పరువు ఎక్కడ పోతుందోనని అనవసరంగా ఈ వ్యవహారంలోకి షాను లాగుతున్నారని చెబుతున్నారు. మరి.. లంక క్రికెట్ విషయంలో షాను రణతుంగ విమర్శించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సెమీస్​కు ముందు షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన కేన్‌ మామ!