iDreamPost
android-app
ios-app

హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్.. నిషేధం విధించిన BCCI!

  • Published May 18, 2024 | 11:50 AM Updated Updated May 18, 2024 | 11:50 AM

చివరి మ్యాచ్ లో లక్నోపై ఓడిన బాధలో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిచ్చింది బీసీసీఐ. పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించింది. ఆ వివరాళ్లోకి వెళితే..

చివరి మ్యాచ్ లో లక్నోపై ఓడిన బాధలో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిచ్చింది బీసీసీఐ. పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించింది. ఆ వివరాళ్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్.. నిషేధం విధించిన BCCI!

IPL 2024లో దారుణ వైఫల్యంతో ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండానే ఇంటిదారి పట్టింది ముంబై ఇండియన్స్. టోర్నీ ప్రారంభం నుంచి పరాజయాలు నమోదు చేస్తూ.. ఏ దశలోనూ ముందుకు సాగే పరిస్థితిలో కనిపించలేదు ముంబై. 14 మ్యాచ్ ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక చివరి మ్యాచ్ లో లక్నోపై ఓడిన బాధలో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిచ్చింది బీసీసీఐ. ఆ వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమించబడ్డాడో.. అప్పటి నుంచి అన్నీ అవమానాలే, ఛీత్కారాలే. ఒకవైపు పరాజయాలు, మరోవైపు విమర్శలు.  వీటన్నిటి మధ్య మానసికంగా కుంగిపోయాడు పాండ్యా. ఇవన్నీ ఒకెత్తు అయితే.. బ్యాటర్ గా, కెప్టెన్ గా, బౌలర్ గా ఈ సీజన్ లో పూర్తిగా విఫలం అయ్యాడు పాండ్యా. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా ప్రభావం చూపలేకపోయాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. ఇంతవరకు బాగానే ఉన్నా.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా బీసీసీఐ పిడుగులాంటి వార్త చెప్పింది.

Unexpected shock for Hardik Pandya

నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై ఇండియన్స్. ఇక టోర్నీలో ఆడిన చివరి మ్యాచ్ లో కూడా ఓడిపోవడంతో ముంబై ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ బాధలో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో ఊహించని షాక్ తగిలింది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో.. రూ. 30 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ. ఈ తప్పు చేయడం మూడోసారి కావడంతో ఓ మ్యాచ్ నిషేధం కూడా విధించింది. అంటే నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ కు పాండ్యా అందుబాటులో ఉండడన్నమాట. పాండ్యాతో పాటుగా ముంబై జట్టులోని ఆటగాళ్లకు కూడా జరిమానా విధించారు. ఒక్కో ప్లేయర్ కు రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం(వీటిలో ఏది తక్కువ అయితే అది) కోత విధించారు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు.