iDreamPost

అయ్యర్​ విషయంలో తప్పు చేసిన బీసీసీఐ! అతడు చేసింది తెలిస్తే పాపం అనకమానరు!

  • Published Feb 29, 2024 | 7:24 PMUpdated Mar 01, 2024 | 2:56 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​కు భారత క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇవ్వడం తెలిసిందే. అతడి కాంట్రాక్టును బోర్డు రద్దు చేయడం విదితమే. అయితే అయ్యర్ విషయంలో బీసీసీఐ తొందరపడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​కు భారత క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇవ్వడం తెలిసిందే. అతడి కాంట్రాక్టును బోర్డు రద్దు చేయడం విదితమే. అయితే అయ్యర్ విషయంలో బీసీసీఐ తొందరపడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Published Feb 29, 2024 | 7:24 PMUpdated Mar 01, 2024 | 2:56 PM
అయ్యర్​ విషయంలో తప్పు చేసిన బీసీసీఐ! అతడు చేసింది తెలిస్తే పాపం అనకమానరు!

భారత క్రికెట్ బోర్డుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోమారు ప్రూవ్ అయింది. తమ ఆదేశాలను పాటించలేదని స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్​పై వేటు వేసింది బీసీసీఐ. వాళ్లిద్దరి కాంట్రాక్టులను రద్దు చేసింది. దీంతో టీమిండియాలోకి వాళ్లు రీఎంట్రీ ఇవ్వడం కష్టంగా మారింది. ఐపీఎల్​తో పాటు డొమెస్టిక్ క్రికెట్​లో అద్భుతంగా రాణించి ఫామ్​, ఫిట్​నెస్ నిరూపించుకుంటే గానీ కమ్​బ్యాక్ ఇవ్వలేరు. ఒకవేళ బాగా ఆడినా రీఎంట్రీకి కోచ్ ద్రవిడ్, బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు అంతా ఓకే అన్నాకే టీమ్​లోకి వస్తారు. ఇంత తతంగం ఉండటంతో ఇప్పట్లో వాళ్లిద్దరూ భారత్​కు ఆడటం కష్టమేనని అంటున్నారు. అయితే అయ్యర్ మీద ఎక్కువ మంది సానుభూతి చూపిస్తున్నారు. ఇషాన్ బోర్డుతో కావాలని పెట్టుకున్నాడని.. అతడ్ని తీసేయడంలో తప్పు లేదంటున్నారు. కానీ అయ్యర్​ విషయంలో మాత్రం బీసీసీఐ తొందరపడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భారత జట్టు కోసం ఎంతో చేసిన ఆటగాడ్ని ఇలా కాంట్రాక్ట్ తీసేసి అవమానించడం సరికాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్-2023 కోసం ఫిట్​గా ఉండాలనే ఉద్దేశంతో గతేడాది కావాలనే ఐపీఎల్​లో ఆడలేదట అయ్యర్. టీమిండియా కోసం రూ.కోట్లకు రూ.కోట్లు వచ్చే ఛాన్స్​ను వద్దనుకున్నాడట. క్యాష్ రిచ్ లీగ్ కంటే దేశానికి ఆడటమే తన ప్రాధాన్యతగా పెట్టుకున్నాడట. అందుకే ఐపీఎల్​లో ఆడకుండా డైరెక్ట్​గా వెళ్లి బ్యాక్ సర్జరీ చేయించుకున్నాడని సమాచారం. ఆ తర్వాత ఫిట్​నెస్ సాధించిన ఈ స్టైలిష్ బ్యాటర్.. ప్రపంచ కప్​లో ఏ రేంజ్​లో దుమ్మురేపాడో తెలిసిందే. అనంతరం జరిగిన సౌతాఫ్రికా సిరీస్​లోనూ తన బ్యాట్ పవర్ చూపించాడు. అలాగే ఇంగ్లండ్​తో సిరీస్​కు ముందు ఓ రంజీ మ్యాచ్ కూడా ఆడాడు. ఇలా బీసీసీఐ కాంట్రాక్ట్​కు అన్ని విధాలుగా న్యాయం చేసినా.. అతడ్ని హఠాత్తుగా తీసేయడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి.

ఇంగ్లండ్​తో మిగిలిన సిరీస్​కు తప్పించడంతో దొరికిన టైమ్​ను రెస్ట్ తీసుకునేందుకు ఉపయోగించుకోవాలని అయ్యర్ భావించాడని టాక్. విశ్రాంతి తీసుకొని ఐపీఎల్​తో పాటు ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచ కప్​లోనూ దుమ్మురేపాలని అనుకున్నాడట. ఒకవేళ రంజీల్లో ఆడితే ఎక్కడ గాయం తిరగబెడుతోందోనని భయపడ్డాడని సమాచారం. కానీ ఈ విషయాన్ని బోర్డు పెద్దలకు, టీమ్ మేనేజ్​మెంట్​కు చెప్పి ఒప్పించాల్సింది పోయి.. గాయం సాకుతో ఎన్​సీఏకు వెళ్లడమే అతడు చేసిన తప్పని చెబుతున్నారు. అయితే అద్భుతంగా రాణిస్తున్న ఆటగాడ్ని, వన్డే వరల్డ్ కప్​లో 66.52 స్ట్రయిక్ రేట్​తో 500కు పైగా పరుగులు, సెమీఫైనల్​లో సెంచరీ బాదినోడ్ని ఎలా తీసేస్తారని అయ్యర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

శ్రేయస్ అయ్యర్ విషయంలో బోర్డు తొందరపడిందని.. ఇషాన్​పై వేటు వేయడం ఖాయం కాబట్టి అయ్యర్​ను కూడా బలిపశువును చేశారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఆటగాళ్లతో నేరుగా కూర్చొని మాట్లాడాల్సింది పోయి.. ఇలా కాంట్రాక్ట్ తీసేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా గత 6 నెలలుగా టెస్టులతో పాటు డొమెస్టిక్ క్రికెట్​కూ దూరంగా ఉంటున్నాడని.. కానీ అతడికి మాత్రం గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఇచ్చారని.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. మరి.. అయ్యర్ విషయంలో బీసీసీఐ తొందరపడిందనే అభిప్రాయాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ కాదు.. భారత క్రికెట్​లో అతడే అందరికంటే పవర్​ఫుల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి