iDreamPost

ఈ శని, ఆదివారాలు కూడా బ్యాంక్‌లు తెరిచే ఉంటాయి.. కానీ

  • Published Mar 29, 2024 | 3:30 PMUpdated Mar 29, 2024 | 3:30 PM

సాధారణంగా శనివారం, ఆదివారం సమయాల్లో.. బ్యాంకులకు సెలవు ఉంటుంది. కానీ, ఈ శనివారం, ఆదివారం అంటే మార్చి 30,31 మాత్రం బ్యాంకులను తెరిచి ఉంచాలని .. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లను ఆదేశించింది.

సాధారణంగా శనివారం, ఆదివారం సమయాల్లో.. బ్యాంకులకు సెలవు ఉంటుంది. కానీ, ఈ శనివారం, ఆదివారం అంటే మార్చి 30,31 మాత్రం బ్యాంకులను తెరిచి ఉంచాలని .. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లను ఆదేశించింది.

  • Published Mar 29, 2024 | 3:30 PMUpdated Mar 29, 2024 | 3:30 PM
ఈ శని, ఆదివారాలు కూడా బ్యాంక్‌లు తెరిచే ఉంటాయి.. కానీ

మార్చి నెలాఖరు ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో అత్యవసర లావాదేవీలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా.. ఈ లావాదేవీలను కొనసాగించేందుకు అన్ని.. ఏజెన్సీ బ్యాంకులు తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. బ్యాంకులను ఆదేశించింది. ముఖ్యంగా ప్రభుత్వ లావాదేవీలు జరిగే అన్ని బ్యాంకులు కూడా.. తెరిచే ఉంచాలని ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది. కాబట్టి 2024 మార్చి 30, 31 తేదీల్లో అన్ని ఏజెన్సీ బ్యాంక్ లు తెరిచే ఉంటాయి. అయితే, అసలు ఏజెన్సీ బ్యాంకులు అంటే ఏమిటి.. ఏ ఏ బ్యాంకులు ఏజెన్సీ బ్యాంకుల కింద వస్తాయి. అలాగే ఆ రోజులలో ఏ ఈ ట్రాన్సక్షన్స్ జరిపేందుకు వీలు కుదురుతుంది అనే విషయాలను తెలుసుకుందాం.

ముందుగా ఏజెన్సీ బ్యాంకులు అంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ప్రకారం.. ఆర్బీఐ తన సొంత పనులతో పాటు.. తన ఏజెంట్స్ గా నియమించుకున్న.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా.. సాధారణ బ్యాంకింగ్ వ్యాపారాలను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో.. 1934లోని సెక్షన్ 45ప్రకారం.. షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులను.. భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా.. ఎక్కడైనా ఏజెంట్స్ గా నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వీలు కల్పిస్తుంది. వీటినే ఏజెన్సీ బ్యాంక్స్ అంటారు. ఇక ఆ తేదీల్లో ఈ లావాదేవీలను చేయొచ్చు అనే విషయానికొస్తే.. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ , రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్.. ద్వారా ఈ ట్రాన్సక్షన్స్ కొనసాగుతాయి. అంతేకాకుండా.. ఏజెన్సీ బ్యాంకులు ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన చెక్కులను కూడా క్లియర్ చేస్తాయి.

ఈ క్రమంలో ఏజెన్సీ బ్యాంకులగా పరిగణించబడే బ్యాంకుల జాబితా ఇలా ఉంది.

1) ఏజెన్సీ బ్యాంకుల పూర్తి జాబితా
2) బ్యాంక్ ఆఫ్ బరోడా
3) బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
5) కెనరా బ్యాంక్
6) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
7) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
8) పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పంజాబ్
9) నేషనల్ బ్యాంక్
10) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
11) యూకో బ్యాంక్
12) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
13) యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్.
14) సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్
15) డిసిబి బ్యాంక్ లిమిటెడ్
16) ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్
17) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్
18) ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్
19) ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్
20) ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్
21) ఇండస్ ఇండ్ బ్యాంక్ లిమిటెడ్
22) జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్
23) కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్
24) కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్
25) కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్
26) ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్
27) సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్
28) యస్ బ్యాంక్ లిమిటెడ్
29) ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్
30) బంధన్ బ్యాంక్ లిమిటెడ్
31) సిఎస్ బి బ్యాంక్ లిమిటెడ్
32) తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్
33) డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్

కాబట్టి మార్చి 30,31 వ తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన విధంగా.. పైన తెలుపబడిన బ్యాంకులు తెరువబడి ఉంటాయి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి