iDreamPost

ఒకే స్థలంపై ఫేక్ డాక్యుమెంట్స్.. 22 బ్యాంకులకు టోకరా! ఇదేం ఫ్యామిలీరా నాయనా!

  • Published Apr 20, 2024 | 10:34 AMUpdated Apr 20, 2024 | 10:34 AM

Fake Documents Scam: ఇటీవల మోసాలు చేస్తూ డబ్బు సంపాదించేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కొంతమంది కేటుగాళ్ళు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకులో భారీ ఎత్తున లోన్లు తీసుకొని తర్వాత ముఖం చాటేస్తున్నారు.

Fake Documents Scam: ఇటీవల మోసాలు చేస్తూ డబ్బు సంపాదించేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కొంతమంది కేటుగాళ్ళు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకులో భారీ ఎత్తున లోన్లు తీసుకొని తర్వాత ముఖం చాటేస్తున్నారు.

  • Published Apr 20, 2024 | 10:34 AMUpdated Apr 20, 2024 | 10:34 AM
ఒకే స్థలంపై ఫేక్ డాక్యుమెంట్స్.. 22 బ్యాంకులకు టోకరా! ఇదేం ఫ్యామిలీరా నాయనా!

ఈ మధ్య చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల అక్రమాలు, మోసాలకు పాల్పపడుతున్నారు. ఎంతోమంది అమాయకులను తమ మాయ మాటలతో మోసగించి లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. చైన్ స్నాచింగ్, డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం, మనీ సర్క్యూలేషన్ స్కీమ్స్ పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. ఇటీవల నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఒకే ఇళ్లు, స్థలం పలువురికి అమ్ముతూ మోసాలకు పాల్పపడుతున్నారు.  అసలు విషయం తెలుసుకొని బాధితులు లబోదిబో అంటున్నారు. అలాంటి ఓ ఘరానా మోసం వెలుగు లోకి వచ్చింది. జనాలనే కాదు.. పలు బ్యాంకులను కూడా మోసం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో స్థలాలు, ఇళ్లు కొనుగోలు విషయాల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఘరానా మోసగాళ్లు ఎంతోమంది అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా ఒకే స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఏకంగా 22 బ్యాంకులకు టోకరా వేశారు. నిందితులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరో విశేషం. బ్యాంకుల ఫిర్యాదు మేరకు ఆరుగురిని జయనగర పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నగర సీపీ దయానంద్ విలేకరుల సమావేశంలో వారి వివరాలు వెల్లడించారు.  సీపీ దయానంద్‌ కథనం మేరకు.. ఒకే కుటుంబానికి చెందిన నాగేశ్‌ భరధ్వాజ్‌, భార్య సుమా, ఆమె సోదరి వేద, భర్త శేషగిరి, తమ్ముడు సతీశ్, అతని స్నేహితుడు బేగూరు గ్రామంలో 2,100 అడుగుల స్థలానికి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి దాదాపు 22 బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి వంతువారీగా రుణం తీసుకున్నారు. కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం అందుకు గాను యంత్రాలు కొనుగోలు చేయాలని రూ. కోటీ 30 లక్షల వరకు రుణం తీసుకున్నారు. అనంతరం బ్యాంకులకు డబ్బు చెల్లించకుండా మోసాలకు పాల్పపడ్డారు.

ఈ క్రమంలోనే జయనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ నారాయణ ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి శుక్రవారం నాగేశ్ భరద్వాజ ఆయన భార్య సుమా లను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోన సంచలన విషయాలు బయట పెట్టారు దంపతులు. తమ కుటుంబం మొత్తం ఈ మోసంలో భాగస్వాములే అని చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఒకే స్థలానికి సంబంధించి సర్వే నెంబర్లు నమోదు చేసి పొడవు, వెడల్పు మార్పులు చేస్తూ నకిలీ పత్రాలను సృష్టించి నాగేశ్ భరద్వాజ్ అతని సతీమణి సుమా రిజిస్ట్రేషన్ చేయించారు. తమ కుటుంబ సభ్యుల సహకారంతో పలు జాతీయ, సహకార బ్యాంకుల్లో నకిలీ డాక్యుమెంట్స్ కుదువబెట్టి 10 కోట్ల వరకు అప్పు తీసుకొని మోసానికి పాల్పపడినట్లు తేలిందన్నారు. ఈ క్రమంలోనే ఆరుగురిని అరెస్టు చేశామని అన్నారు ఏసీపీ నారాయణ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి