iDreamPost

జనవరి 22 సోమవారం బ్యాంకులకు సెలవు ఉందా.. లేదా?

  • Published Jan 20, 2024 | 1:16 PMUpdated Jan 20, 2024 | 1:16 PM

అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సంధర్బంగా జనవరి 22వ తేదీన.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సగం సెలవును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో మరి బ్యాంకులకు కూడా హాలిడే ఉందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సంధర్బంగా జనవరి 22వ తేదీన.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సగం సెలవును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో మరి బ్యాంకులకు కూడా హాలిడే ఉందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

  • Published Jan 20, 2024 | 1:16 PMUpdated Jan 20, 2024 | 1:16 PM
జనవరి 22 సోమవారం బ్యాంకులకు సెలవు ఉందా.. లేదా?

రామ జన్మ భూమి అయోధ్యలో ఆ రామయ్య తండ్రి కొలువుతీరబోతున్నాడు. మరి కొద్దీ గంటల్లో ఈ మహత్తర తరుణం కనుల పండుగగా జరగనుంది. ఇప్పటికే రామ మందిరంలో పూజ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వేల సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక దేశంలోని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు టీవీలలో..దీనిని ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు. పైగా ఆరోజున దేశ వ్యాప్తంగా హాఫ్ హాలిడేను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రమే పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ ఉత్తర్వులు దేశంలో ఉన్న బ్యాంకులకు కూడా వర్తిస్తుందా ! ఒకవేళ వర్తిస్తే హాలిడే ఏ రకంగా ఉంటుంది! అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జనవరి 22వ తేదీన యావత్ భారతదేశం గర్వించే విధంగా.. అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన జరగనుంది. ఈ క్రమంలో దేశంలోని అన్ని సంస్థలకు హాఫ్ హాలిడేను ప్రకటించారు. కాబట్టి ఆరోజు మధ్యాహ్నం నుంచి అన్ని సంస్థలు పనిచేయనున్నాయి. మరి ఆరోజు బ్యాంకులు పని చేస్తాయా లేదా.. ఒకవేళ పని చేస్తే బ్యాంకులు కూడా సగం రోజునుంచే ఓపెన్ అవుతాయా అనే విషయాలపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగానే ఇప్పటికే దాదాపు అన్ని సంస్థలకు.. పాఠశాలలు , కళాశాలలకు హాలిడేనే ప్రకటించారు. మరి ఈ దశలో బ్యాంకులకు ఈ హాలిడే ఎలా ఉండబోతుందా అనేది అందరికి ప్రశ్నగా మారింది. అలాగే బ్యాంకుల నుంచి కూడా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. రామ మందిర ప్రతిష్టాపన కోసం అయోధ్య వరకు వెళ్లలేని వారు..తమ ఇళ్లవద్దనే ఈ మహత్తర సన్నివేశాలను వీక్షించి.. ఆ తర్వాత ఎవరి పనులలో వారు నిమగ్నం అయ్యే విధంగా.. ఇలా హాఫ్ హాలిడేను ప్రకటించారు. అంటే ఆరోజు మధ్యాహ్నం నుంచి అన్ని ఆఫీస్ లు పని చేస్తాయి. కానీ, బ్యాంకుల విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు.

అంతేకాకుండా.. రాముల వారి ప్రతిష్టాపన రోజున అందరు వారి ఇళ్ల వద్ద పూజలు నిర్వహించాలని కూడా తెలియజేశారు. ఇప్పటికే అయోధ్య రాముడి ఆశీర్వాదంగా.. దాదాపు దేశంలోని అందరి ఇళ్లకు అక్షింతలను అందచేశారు. కాబట్టి అయోధ్యకు వెళ్లే అవకాశం లేని భక్తులంతా ఆరోజున వారి ఇళ్ల వద్దనే.. భక్తి శ్రద్దలతో ఈ పూజ కార్యక్రామలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి, ఆరోజున బ్యాంకులు పని చేసే సమయాలు ఎలా ఉంటాయా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి