iDreamPost

బ్యాంకులోన్ ఉన్నవారికి RBI అదిరిపోయే శుభవార్త

  • Published Apr 12, 2024 | 3:15 PMUpdated Apr 12, 2024 | 3:15 PM

ప్రస్తుత కాలంలో చాలామంది వివిధ బ్యాంకులలో గృహ రుణం ,వాహన రుణం వంటి వాటి కోసం రుణాలు తీసుకుంటున్నారు. అయితే అలా రుణాలు తీసుకున్న వారు నెల నెల ఈఎంఐలు చెల్లించే సమయంలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఎదురవ్వడం వలన లోన్ చెల్లించడం ఆలస్యం అవుతుంది. మరి అలాంటి రుణ గ్రహితల కోసం ఆర్బీఐ ఓ శుభవార్తను అందించింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో చాలామంది వివిధ బ్యాంకులలో గృహ రుణం ,వాహన రుణం వంటి వాటి కోసం రుణాలు తీసుకుంటున్నారు. అయితే అలా రుణాలు తీసుకున్న వారు నెల నెల ఈఎంఐలు చెల్లించే సమయంలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఎదురవ్వడం వలన లోన్ చెల్లించడం ఆలస్యం అవుతుంది. మరి అలాంటి రుణ గ్రహితల కోసం ఆర్బీఐ ఓ శుభవార్తను అందించింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 12, 2024 | 3:15 PMUpdated Apr 12, 2024 | 3:15 PM
బ్యాంకులోన్ ఉన్నవారికి RBI అదిరిపోయే శుభవార్త

సాధారణంగా ఎవరైనా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న, సొంతింటి కలను నెరవేర్చకోవలని, వాహనాలు కొనుగోలు చేయడానికి అందుకు సరిపడ నగదు ఉండకపోవచ్చు. అందుకోసం చాలామంది ఎంతో కొంత రుణాన్ని బ్యాంకుల నుంచి పొందుతుంటారు. ఈ క్రమంలోనే బ్యాంకులురుణ గ్రహితకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ ను సరిచూసుకుని లోన్స్ మంజూరు చేస్తూ.. లోన్స్ ను అందిస్తుంటాయి. అయితే ఇలా తీసుకున్నరుణానికి నెల నెల కొంత మొత్తాన్ని ఈఎంఐ ల రూపంలో రుణ గ్రహితలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈఎంఐలు చెల్లించే సమయంలో.. ఒక్కోసారి ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఎదురవుతుంటాయి. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు లోన్ లు చెల్లించడం చాలా ఆలస్యం అవుతుంటాయి. ఇందులో భాగంగానే.. ఈఎంఐలు చెల్లించే రుణ గ్రహితలకు ఆర్బీఐ ఓ శుభవార్తను అందించింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల జరిగిన ద్రవ్య విధాన సమావేశాలలో RBI ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుత కాలంలో చాలామంది బ్యాంకులలో వివిధ రకాలుగా రుణాలను తీసుకుంటున్నారు. అందులో గృహ రుణం ,వాహన రుణం వంటి ఇతర ఏవైనా రుణాలు తీసుకున్నట్లయితే.. వాటిలో ఈ EMI లో కాస్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే తాజాగా జరిగిన ద్రవ్య విధాన సమావేశాలలో.. ఆర్.బీ.ఐ వరుసగా 7వ సారి కూడా రెపో రేట్లను స్థిరంగా ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేట్లు ప్రభావితం ఇప్పుడు రుణాలపై పడే అవకాశం లేదు. అందువల్ల రుణ గ్రహీతల లోన్స్ EMI ప్రస్తుతానికి అలాగే కొనసాగుతాయి. ఉదాహరణకు.. మీరు ఒక 20 సంవత్సరాలకు గాను 8.60% వడ్డీటు తో రూ. 25 లక్షల గృహ రుణాన్ని తీసుకుంటే..  అందుకు నెలకు EMI రూ.21,854 అవుతుంది. ఇదే నిబంధన ప్రకారం.. రూ. 40 లక్షల రుణాన్ని పొందినట్లయితే దానికి గాను నెలకు EMI రూ.34,967 ,అవుతుంది. అయితే ప్రస్తుతం ఆర్.బి.ఐ రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. కాబట్టి మీ  EMI లలో కూడా ఎలాంటి మార్పు ఉండదు.

ఇక రాబోయే కాలంలో.. ఒకవేళ RBI ద్వారా రెపో రేట్లు ఏమైనా మార్పులు చెందినట్లయితే బ్యాంకులలో, ఆర్థిక సంస్థల ద్వారా తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు పై కూడా సవరణలు జరుగుతాయి. అందుచేత   ఒకవేళ రెపో రేట్లు పెరిగినట్లయితే రుణ వడ్డీ రేట్లు కూడా పెరిగిపోతాయి. అయితే దీనికి విరుద్ధంగా RBI రెపో రేటు తగ్గించినట్లయితే వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరు సరసమైన రుణాలను అందుకుంటారు. మొత్తానికి ఇప్పుడు రెపో రేట్లు స్థిరత్వంగా ఉండటం వలన రుణ గ్రహీతలు ప్రయోజనాలను పొందారనే చెప్పాలి. మరి, ఈఎంఐలు చెల్లించే రుణ గ్రహితలకు ఆర్బీఐ అందించి న ఈ శుభవార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి