iDreamPost
android-app
ios-app

ఆగస్ట్‌ నెలలో 14 రోజులు బ్యాంక్‌లు బంద్‌.. లిస్ట్‌ ఇదే

  • Published Aug 01, 2023 | 1:46 PM Updated Updated Aug 01, 2023 | 1:46 PM
  • Published Aug 01, 2023 | 1:46 PMUpdated Aug 01, 2023 | 1:46 PM
ఆగస్ట్‌ నెలలో 14 రోజులు బ్యాంక్‌లు బంద్‌.. లిస్ట్‌ ఇదే

జూలై ముగిసింది.. ఆగస్ట్‌ నెల ప్రారంభం అయ్యింది. కొత్త నెల ప్రారంభం అయ్యిందంటే.. కొత్త రూల్స్‌ అమల్లోకి వస్తాయి. అలానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, గ్యాస్‌ సిలిండర్‌ రేట్లు కూడా మారుతుంటాయి. అలానే బ్యాంక్‌లకు సంబంధించిన రూల్స్‌లో వచ్చిన మార్పులు కూడా నెల ప్రారంభం నుంచి అమల్లోకి వస్తాయి. డిజిటిల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్నా సరే.. ఇప్పటికి కూడా బ్యాంక్‌లకు తప్పకుండా వెళ్లాల్సిన అవసరం అయితే పూర్తిగా పోలేదు. గోల్డ్‌ లోన్‌, ఎఫ్‌డీలు వంటి వాటి కోసం బ్యాంక్‌కు తప్పకుండా వెళ్లాల్సి వస్తుంది. అయితే ప్రతి నెల బ్యాంకులకు ఆదివారం మాత్రమే కాక పర్వదినాల సందర్భంగా సెలవులు ఇస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లన్నింటికి ఈ సెలవులు ఒకే విధంగా వర్తిస్తాయి. మరి ఆగస్ట్‌ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి అంటే..

ఆగస్ట్‌ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంక్‌లు బంద్‌ ఉండనున్నాయి. వీటిలో ఆదివారాలు, రెండు, నాలుగవ శనివారాలు కలుపుకుని.. ఈ 14 రోజులు సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ అప్డేట్ చేసింది. అందులోని వివరాల ప్రకారం బ్యాంకులకు సాధారణ సెలవులతో పాటు జాతీయ, ప్రాంతీయ పండగలకు సెలవులు ఉంటాయి. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవులు వివరాలు ఇలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తంగా బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంక్‌లకు 7 రోజులు సెలవులు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో వివరాలు..

  • ఆగస్టు 6వ తేదీన ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు
  • ఆగస్టు 12వ తేదీన రెండో శనివారం, సాధారణ సెలవు
  • ఆగస్టు 13వ తేదీన ఆదివారం, సెలవు
  • ఆగస్టు 15న మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం, నేషనల్‌ హాలీడే
  • ఆగస్టు 20న ఆదివారం
  • ఆగస్టు 26వ తేదీన నాలుగో శనివారం
  • ఆగస్టు 27వ తేదీన ఆదివారం

పైన పేర్కొన్న సెలవులు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంక్‌లకు వర్తిస్తాయి. ఇవే కాక ప్రాంతాల వారీగా మరో 7 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. అయితే ఇవి అన్ని బ్యాంక్‌లకు వర్తించవు. ఆ వివరాలు..

మరో 7 రోజులు సెలవులు..

  • ఆగస్టు 8న టెండాంగ్‌లో ఫాట్ సెలవు
  • ఆగస్టు 16న పార్శీ కొత్త సంవత్సరం సందర్భంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లో సెలవు ప్రకటించారు.
  • ఆగస్టు 18న శ్రీమంత శంకరదేవ గువాహటిలో సెలవు డిక్లేర్‌ చేశారు.
  • ఆగస్టు 28న మొదటి ఓనం సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంక్‌లకు సెలవు.
  • ఆగస్టు 29న తిరువోన కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంక్‌లకు సెలవు ప్రకటించారు.
  • ఆగస్టు 30 రక్షా బంధన్ సందర్భంగా జైపూర్, షిమ్లాలో సెలవు ప్రకటించారు.
  • ఆగస్టు 31 రక్షా బంధన్‌ సందర్భంగా శ్రీనారాయణ్ గురు జయంతి, పాంగ్ ల్హా బ్సోల్ డెహ్రాడూన్, గ్యాంగ్ టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో బ్యాంక్‌లకు సెలవులుగా డిక్లేర్‌ చేశారు.