SNP
SNP
క్రికెటర్లు మ్యాచ్‌లు లేని సమయంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండటం చూశాం. కానీ, ఈ క్రికెటర్ నిప్పులపై నడుస్తున్నాడు. సాధారణంగా మన దేశంలో దేవుడిపై భక్తి చాటుకునేందుకు కొంతమంది నిప్పులపై నడుస్తుంటారు. కానీ, ఈ బంగ్లాదేశ్ క్రికెటర్ మాత్రం దేవుడి కోసం నిప్పులపై నడవలేదు. తన కోసం, ఆసియా కప్ కోసం నిప్పులపై నడిచాడు. బంగ్లాదేశ్ యువ స్టార్ ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ షేక్.. ‘మైండ్-ట్రైనింగ్’లో భాగంగా ఇలా నిప్పులపై నడిచారు. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మంచి ప్రదర్శన కనబర్చేందుకు మానసికంగా మరింత దృఢంగా అయ్యేందుకు నయీమ్ ఇలా నిప్పులపై నడిచాడు.
మైండ్ ట్రైనింగ్‌లో భాగంగా ట్రైనర్ చెప్పినట్లు అతను నిప్పులపై నడిచాడు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లు మానసికంగా దృఢంగా అవ్వడమే కాకుండా ధైర్యాన్ని పెంపొందిచుకుని, భయాన్ని అదుపులో పెట్టుకోవడం అలవాటు చేసుకుంటారని, ఫైర్ వాకింగ్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయని ట్రైనర్ వెల్లడించారు. అయితే.. ఇలా ఆటగాళ్లను మెంటల్‌గా స్ట్రాంగ్ మైండ్‌సెట్‌ను బిల్డ్ చేయడానికి బీసీసీఐ లాంటి బోర్డులు మెంటల్ బ్యాలెన్స్ కోచ్‌లను కూడా నియమిస్తున్నాయి. కానీ, గతంలో ఏ క్రికెటర్ కూడా ఇలా నిప్పులపై నడవలేదు. దీంతో నయీమ్ నిప్పులపై నడిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇకపోతే.. మరో రెండు వారాల్లో ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో మరికొన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనదని బీసీసీఐ తెగేసి చెప్పడంతో టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. దీంతో టీమిండియా తమ మ్యాచ్‌లన్ని పాకిస్థాన్ బయటే ఆడనుంది. కాగా, ఈ టోర్నీలో శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. అలాగే బంగ్లాదేశ్ పెద్ద జట్లకు గట్టి పోటీ ఇచ్చి.. వన్డే వరల్డ్ కప్ 2023కు పటిష్టంగా సిద్ధం అవ్వాలని భావిస్తోంది. మరి ఈ ఆసియా కప్‌లో ఏ జట్టు విజయావకాశాలను కాసేపు పక్కన పెడితే.. బంగ్లా క్రికెటర్ నయీమ్ నిప్పులపై నడకపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
bangladesh cricketer mohammad nayeem walking on fire pic.twitter.com/NOGpJAvrxP
— Sayyad Nag Pasha (@nag_pasha) August 19, 2023
ఇదీ చదవండి: మీ ప్రయోగాలకో దండం..! తిలక్ వర్మను కూడా నాశనం చేసేలా ఉన్నారుగా..