iDreamPost
android-app
ios-app

కర్నూల్ మాజీ మేయర్ ఆత్మహత్య యత్నం

కర్నూల్ మాజీ మేయర్ ఆత్మహత్య యత్నం

కర్నూల్ మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆత్మహత్య ప్రయత్నం చేయడం కలకలం రేపుతుంది.. ఆర్ధిక ఇబ్బందులుతో పాటుగా, కొందరు నేతలు మోసం చేసారని మనస్తాపం చెందిన బంగి అనంతయ్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశారు.అయితే ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు బంగి అనంతయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

తనకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదని, సరైన పదవులు ఇవ్వడం లేదని మొదటినుండి చంద్రబాబును విమర్శిస్తూ వస్తున్న బంగి అనంతయ్య తాజాగా ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో మరోసారి చర్చలకు దారి తీసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం అనేక వేషాల్లో నిరసన తెలిపినప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత పలు సందర్భాల్లో చంద్రబాబు తనను మోసం చేసారని ఆయన మాటలు నమ్మి ఇళ్లు, ప్లాటు అన్ని అమ్ముకున్నానని, అయితే ఆయన మాత్రం నన్ను సన్యాసిగా మార్చారని ఆరోపించారు. రకరకాల వేషధారణలో విమర్శిస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు.

కాగా తాజా ఆత్మహత్య ప్రయత్నానికి కారణం పార్టీలో తనకు తగిన గుర్తింపు,పదవులు లభించకపోవడంతో పాటు ఆర్ధిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.ఉరి వేసుకోవడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే బంగి అనంతయ్య ఆత్మహత్య ప్రయత్నం చేసారని ఆయన కుమారుడు తెలిపారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet