iDreamPost

Bangaru Raju : నాగార్జున ధీమా అందుకోసమేనా

Bangaru Raju  : నాగార్జున ధీమా అందుకోసమేనా

2022 జనవరి సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు ఉండటం కన్ఫర్మ్ అయ్యింది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. సర్కారు వారి పాట నిర్మాతలు ఆల్రెడీ ఏప్రిల్ కు వెళ్లిపోవాలనే ఆలోచన చేస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. భీమ్లా నాయక్ ఏం చేస్తాడో తెలియదు. పైన రెండింటికి ఎదురెళితే కలెక్షన్ల విషయంలో రిస్క్ ఉంటుంది. సరే ఇప్పుడు కాకపోయినా ఇంకొద్ది రోజుల్లో ఏదో ఒకటి తేల్చాల్సిందే. ముందు రావాలనుకున్న ఎఫ్3 హ్యాపీగా ఫిబ్రవరికి షిఫ్ట్ అయిపోయింది. అదే నెల 4కి ఆచార్య లాక్ చేసుకున్నాడు. ఎటొచ్చి నాగార్జున మాత్రం తన బంగార్రాజుని జనవరి 15కే రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారని అన్నపూర్ణ టాక్.

దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు ఎంత రచ్చ చేసినా సంక్రాంతి బరిలో మూడో సినిమాకు ఖచ్చితంగా స్పేస్ ఉంటుంది. అందులోనూ వాటికి వచ్చే ఓవర్ ఫ్లోస్ ని కరెక్ట్ గా వాడుకోగలిగితే బంగార్రాజు లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న సినిమాలకు చాలా ప్లస్ అవుతుంది. గత సంవత్సరం సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో తలపడినప్పుడు బాలేదని టాక్ వచ్చిన దర్బార్ కూడా 8 కోట్లకు పైగా రాబట్టింది. ఎవరూ పట్టించుకోని ఎంత మంచివాడవురాకు సైతం డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. మరి ఇలాంటి సీన్ లో బంగార్రాజు దిగితే సోగ్గాడే చిన్న నాయనా రేంజ్ కంటెంట్ ఉంటే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా.

ఇదంత చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా నాగ్ ఎంతమేరకు మాట మీద ఉంటారో చూడాలి. ఎందుకంటే బంగార్రాజు షూటింగ్ వేగంగానే జరుగుతోంది కానీ ఇంకా చాలానే బ్యాలన్స్ ఉంది. సరే వేగంగా పూర్తి చేస్తారనుకున్నా అసలైన ప్రమోషన్లు ఎప్పుడు నుంచి మొదలుపెడతారో చెప్పాల్సి ఉంది. అసలే చేతిలో ఉన్నది 75 రోజులు. ఇది చాలా తక్కువ టైం. సోగ్గాడే చిన్ని నాయనను అందరూ మర్చిపోయిన తరుణంలో దానికి సీక్వెల్ అంటే జనం ఎగబడి వస్తారా అంటే వెంటనే చెప్పలేం. ఆర్ఆర్ఆర్ రాధే శ్యామ్ లలో ఏ ఒక్కటి యావరేజ్ లేదా ఫ్లాప్ అయినా అప్పుడు బంగార్రాజు పండగ చేసుకోవచ్చు. కానీ అదంత ఈజీ కాదు

Also Read : Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ ఆఖరి చిత్రం జేమ్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి