Uppula Naresh
Uppula Naresh
గత కొన్నేళ్ల నుంచి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు మరింత వెక్కువయ్యాయి. డబ్బులు తీసుకున్న వ్యక్తులు చెప్పిన సమయానికి చెల్లించకపోవడంతో ఫోన్ లు చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంతటితో ఆగకుండా.., వారి వ్యక్తిగత విషయాలను సైతం వారి వారి బంధువులు వివరించి బాధితుల పరువు తీస్తున్నారు. లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు పెచ్చుమీరడంతో తట్టుకోలేక ఇప్పటికీ ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. అచ్చం ఇలాగే ఓ విద్యార్థి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులను తట్టుకోలేక తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడి మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరు యలహంకలోని నిటకటెలోని మీనాక్షి కాలేజీలో 22 ఏళ్ల తేజస్ అనే యువకుడు చదువుకుంటున్నాడు. అయితే, ఇతడు తన అవసరం నిమిత్తం ఓ లోన్ యాప్ ద్వారా కొంత మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. చెప్పిన సమయానికి చెల్లిస్తానని వారికి హామీ ఇచ్చాడు. అతడు చెప్పిన సమయం కూడా రానే వచ్చింది. దీంతో లోన్ యాప్ ఎజెంట్లు తేజస్ కు తరుచు ఫోన్ చేయడం మొదలు పెట్టారు. తీసుకున్న డబ్బులు తీర్చడానికి అతని వద్ద డబ్బులు లేవు. ఇక తేజస్ కూడా ఎలాగైన తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని అనుకున్నాడు.
అయితే, ఈ క్రమంలోనే ఆ లోన్ యాప్ ఎజెంట్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తరుచు ఫోన్ లు చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడరు. ఆ విద్యార్థికి ఏం చేయాలో తెలియక తాజాగా తన రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అప్రమత్తమై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కుమారుడి మరణవార్త తెలుసుకున్న అతని తల్లిండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఇది కూడా చదవండి: వీడియో: భర్త ఎంత ఇంటికి రాకపోతే మాత్రం ఇలా చేస్తారా?