iDreamPost

నిర్వహణ సలహాల కోసం త్వరలో తిరుమలకు అయోధ్య బృందం

రామ భక్తులకు 500 ఏళ్ల పోరాట ఫలితం..అయోధ్యలో రామ మందిర నిర్మాణం జనవరి 22 న అంగరంగ వైభవంగా జరిగింది. ఆ రోజు బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట ఎంతో అట్టహాసంగా జరిపించారు.

రామ భక్తులకు 500 ఏళ్ల పోరాట ఫలితం..అయోధ్యలో రామ మందిర నిర్మాణం జనవరి 22 న అంగరంగ వైభవంగా జరిగింది. ఆ రోజు బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట ఎంతో అట్టహాసంగా జరిపించారు.

నిర్వహణ సలహాల కోసం త్వరలో తిరుమలకు అయోధ్య బృందం

యావత్ దేశ ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన అద్భుత ఘట్టం ముగిసింది. జనవరి 22న ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. 2020, ఆగస్టు 5న రామ మందిర నిర్మాణ ప్రారంభానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది. సోమవారం ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత మంగళవారం నుంచి శ్రీరాముడి దర్శన ఏర్పాటు చేశారు ఆలయ నిర్వాహకులు. త్వరలో తిరుమలకు అయోద్య ఆలయ ట్రస్ట్ నిర్వహకులు రానున్నట్లు తెలుస్తుంది. దీనికి గల కారణం ఎంటో తెలుసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఈ నెల 22 న అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. బాల రాముడి దర్శనం కోసం రోజు రోజుకీ భక్తుల తాకిడి పెరిగిపోతూ వస్తుంది. ఒకదశలో భద్రతా బలగాలు భక్తులను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన సమయాలు పెట్టినప్పటికీ.. భక్తులు కిటకిటాడుతున్నారు. రోజుకీ లక్షల్లో భక్తులు స్వామి వారి సందర్శనం చేసుకుంటున్నారని ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. అయోధ్యలో పెరిగిపోతున్న భక్తుల విషయంలో ఆలయ ట్రస్ట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అతి త్వరలో ఆలయ ట్రస్ట్ నిర్వాహకుల బృందం తిరుమలకి విచ్చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం టీటీడీ చైర్మన భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తుల క్యూ లైన్ మేనేజ్ మెంట్, ఆర్జిత సేవలు, ప్రసాదం, అన్నదానం, భక్తుల భద్రత, వసతి సదుపాయం లాంటి ఎన్నో అంశాల గురించి టీటీడీ నుంచి సలహాలు తీసుకోబోతున్నట్లు కరుణాకరెడ్డి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో టీటీడీ కి ఎంతో గొప్ప పేరు ఉన్న కారణంతో అయోధ్య రామ మందిర ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందని ఆయన అన్నారు. తమకు సాధ్యమైనంత వరకు పూర్తి సహకారం అందిస్తామన్న టీటీడీ చైర్మన్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి