Nidhan
ఆస్ట్రేలియా పించ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్ నుంచి మరో సంచలన ఇన్నింగ్స్ వచ్చింది. విండీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో విధ్వంసక శతకంతో చెలరేగాగాడు మ్యాక్సీ.
ఆస్ట్రేలియా పించ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్ నుంచి మరో సంచలన ఇన్నింగ్స్ వచ్చింది. విండీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో విధ్వంసక శతకంతో చెలరేగాగాడు మ్యాక్సీ.
Nidhan
ప్రస్తుత క్రికెట్లో డేంజరస్ బ్యాటర్ ఎవరంటే అందరూ చెప్పే పేర్లలో ఒకటి గ్లెన్ మ్యాక్స్‌వెల్. క్లాసికల్ షాట్స్, క్రికెట్ బుక్ షాట్స్‌కు అతడి దగ్గర చోటు ఉండదు. స్కూప్, స్వీప్, రివర్స్ స్వీప్.. అంటూ వైవిధ్యమైన షాట్లతో బౌలర్లను ఊచకోత కోయడం మ్యాక్స్‌వెల్‌కు వెన్నతో పెట్టిన విద్య. అతడు క్రీజులో నిలదొక్కుకున్నాడంటే చాలు.. అవతలి టీమ్ విజయంపై ఆశలు వదిలేసుకుంటుంది. ఎలాంటి మ్యాచ్‌ను అయినా సింగిల్ హ్యాండ్‌తో తన జట్టు వైపు తిప్పడం మ్యాక్సీకి అలవాటుగా మారింది. అందుకు ఇటీవల వన్డే వరల్డ్ కప్‌లో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ బిగ్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. తాజాగా మరోమారు అతడి బ్యాట్ గర్జించింది. బ్లాస్టింగ్ సెంచరీతో అందర్నీ అలరించాడు మ్యాక్స్‌వెల్. అయితే అతడి ఇన్నింగ్స్‌లో ఓ సిక్స్ మాత్రం మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
విండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో మ్యాక్స్‌వెల్ రెచ్చిపోయి ఆడాడు. 55 బంతుల్లోనే 120 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలతో పాటు 8 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే దాదాపు 100 పరుగులు చేశాడు మ్యాక్సీ. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏ రేంజ్లో సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. తన స్టైల్లో ఎడాపెడా షాట్లు కొడుతూనే వీలు కుదిరినప్పుడు స్విచ్ షాట్స్, రివర్స్ స్వీప్స్ కూడా బాదాడు మ్యాక్స్‌వెల్. ఈ క్రమంలో నిల్చున్న చోటు నుంచే లెగ్ సైడ్ దిశగా ఓ భారీ సిక్స్ బాదాడు. జోసెఫ్ బౌలింగ్‌లో అతడు కొట్టిన ఆ బాల్ ఏకంగా 109 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఈ షాట్ చూసిన నెటిజన్స్ ఓడియమ్మ ఇదేం సిక్సు మ్యాక్సీ.. ఇలాంటివి కొట్టడం నీకే సాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, తాజా సెంచరీతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల లిస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (5 సెంచరీలు)తో కలసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు మ్యాక్సీ. హిట్‌మ్యాన్ కూడా మ్యాక్స్వెల్లాగే ఐదు సెంచరీలు బాదాడు. కానీ అందుకు అతడికి 143 ఇన్నింగ్స్‌లు పట్టింది. కానీ మ్యాక్సీ కేవలం 94 ఇన్నింగ్స్‌ల్లోనే 5 సెంచరీల మార్క్‌ను చేరుకున్నాడు. వీళ్లిద్దరి తర్వాతి ప్లేసులో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (57 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు) ఉన్నాడు. కాగా, మ్యాక్స్‌వెల్ సుడిగాలి శతకంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన విండీస్ ప్రస్తుతం వికెట్ కోల్పోకుండా 11 పరుగులతో ఉంది. ఆ జట్టు నెగ్గాలంటే 19 ఓవర్లలో ఇంకా 231 పరుగులు చేయాల్సి ఉంది. మరి.. మ్యాక్సీ తుఫాన్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: IND vs ENG: బజ్‌బాల్ కాదు.. బూమ్బాలే తోపు.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
109M SIX BY GLENN MAXWELL …!!! 🤯pic.twitter.com/0jSgWYdTHZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 11, 2024
Most T20i centuries:
Glenn Maxwell – 5* (94 innings).
Rohit Sharma – 5 (143 innings).
Suryakumar Yadav – 4 (57 innings). pic.twitter.com/MvXYgSVnia— Mufaddal Vohra (@mufaddal_vohra) February 11, 2024