iDreamPost

తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. తాము కూడా ప్రత్యామ్నాయమే అంటున్న ఒవైసీ!

తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. తాము కూడా ప్రత్యామ్నాయమే అంటున్న ఒవైసీ!

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ ముఖచిత్రం మారిపోబోతున్నట్లు కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీనే అంటూ చెప్పుకొచ్చారు. అరెస్టైన ఎంఐఎం తలు అంతా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ గెలుపు కోసం పనిచేసిన వారే అంటూ వ్యాఖ్యానించారు. ఏ పార్టీ మద్దతు, ఎవరితో ముందుకు వెళ్లాలి అనేది ఆలోచిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షీకీల్ ఫిర్యాదుతో మజ్లిస్ నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టైన నేతలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలుసుకున్నారు. ములాఖత్ తర్వాత రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కు ఎన్నికలతోనే బుద్ధి చెబుతాం. ఎంఐఎం కౌన్సిలర్స్, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసుల వ్యవహారాన్ని సీఎం కేసీఆర్, డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం.

వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల నుంచి పోటీ చేస్తాం.. ఎక్కడి నుంచి పోటీ చేస్తాం అనేది ఎన్నికల ముందు ప్రకటిస్తాం. ఇప్పుడు అరెస్టైన మజ్లిస్ నేతలు అంతా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ గెలుపు కోసం పని చేసిన వారే. ముస్లిం బంధు విషయాన్ని గతంలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ముస్లింలలో కూడా ఎంతో మంది పేదవారు ఉన్నారు. వారికి కూడా ముస్లిం బంధు ఇవ్వాలి. సచివాలయం నిర్మాణం కోసం మసీదులు తొలగించారు.

వాటిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. పాట్నా మీటింగ్ కు ప్రతిపక్ష పార్టీలు నాకు పిలుపు పంపలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ కూడా ప్రత్యామ్నాయమే అని గుర్తుంచుకోవాలి. మొదట పార్టీ బలోపేతానికి పని చేస్తాం. ఆ తర్వాతే ఏ పార్టీతో ముందుకెళ్లాలి అనే విషయాలపై ఆలోచన చేస్తాం” అంటూ వ్యాఖ్యానించారు. ఒవైసీ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు తెర లేపాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయంటూ కామెంట్స్ వనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి