సెలబ్రిటీలకు వివాదాలు కొత్తేమీ కాదు. ఇండస్ట్రీలో ఏదో ఒక విషయానికి సంబంధించి వివాదాల్లో చిక్కుకోవడం సెలబ్రిటీలకు సాధారణమైన విషయమే. కానీ ఆస్కార్ విజేత, వరల్డ్ క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ మాత్రం తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. వరుస వివాదాలు ఆయన్ని వెంటాడుతున్నాయి. కొన్ని రోజుల కిందట ఓ వివాదంలో చిక్కున్న రెహమాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వివాదానికి సంబంధించి చెన్నై సర్జన్స్ అసోసియేషన్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
గత కొంతకాలంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ వివాదాలతో సావాసం చేస్తున్నారు. ఒకటి తర్వాత మరోటి వివాదం ఆయన్ని వెంటాడుతున్నాయి. ఇంతకు ముందు రెహమాన్ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన మాటల వల్ల వివాదాలు తెలెత్తగా.. ఇప్పుడు రెహమాన్ పాత వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు రెహమాన్. అసలేం జరిగిందంటే? 2018లో ఓ మ్యూజిక్ కన్సర్ట్ కోసం డబ్బులు తీసుకున్న రెహమాన్ వాటిని తిరిగి చెల్లించలేదని చెన్నై సర్జన్స్ అసోసియేషన్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఒక్కరోజు మ్యూజిక్ కన్సర్ట్ కోసం.. రెహమాన్ కు రూ. 25 లక్షల రూపాయాలు చెల్లించినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. అయితే అప్పుడు ఆ ప్రొగ్రామ్ జరిగిందా? లేదా? అన్నది తెలియాలి. కాగా.. ఈ విషయంలో రెహమాన్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఈ వార్తల్లో నిజం లేదని రెహమాన్ మేనేజర్ సెంథిల్ వేలన్ తెలిపారు. ఇక కొన్ని రోజుల క్రితం చెన్నైలో రెహమాన్ నిర్వహించిన సంగీత కచేరి రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. నిర్వాహణ వైఫల్యం కారణంగా ఈ మ్యూజిక్ కన్సర్ట్ ను మధ్యలోనే ముగించడంతో.. తీవ్ర విమర్శలకు దారితీసింది. మరి తరచుగా వివాదాల్లో చిక్కుంటున్న ఏఆర్ రెహమాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.