iDreamPost

ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఈ జాబ్స్ మీకోసమే.. నెలకు జీతం 38,000

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. ఇంటర్మీడియట్ అర్హతతో గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. ఇంటర్మీడియట్ అర్హతతో గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఈ జాబ్స్ మీకోసమే.. నెలకు జీతం 38,000

ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ కాంపిటీషన్ ఉంది. ప్రైవేట్ రంగంలో లక్షల జీతాలు వచ్చినా సరే.. ప్రభుత్వ ఉద్యోగమే మేలంటున్నారు యువత. అందుకే గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా ఏళ్లకేళ్లుగా ప్రిపేర్ అవుతున్నారు. లక్ష్యాన్ని అలక్ష్యం చేయకుండా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా?అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

హైదరాబాద్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ అడ్హక్ ప్రాతిపదికన టీచింగ్, అడ్మిన్ స్టాఫ్(నాన్ టీచింగ్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, టెట్‌, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ భాష, కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను బట్టి నెలకు 26 వేల నుంచి 38 వేల వరకు జీతం అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య: 15

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రైమరీ టీచర్:

 • 04

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ):

 • 05

ల్యాబ్‌ ఇన్‌ఛార్జ్‌ (ఏటీఎల్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌):

 • 01

ఏఐ టీచర్‌ (టీజీటీ):

 • 01

ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌:

 • 02

అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌:

 • 01

అర్హత:

 • పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, టెట్‌, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ భాష, కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

 • పోస్టులను అనుసరించి అభ్యర్థులు 25 – 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

 • ప్రైమరీ టీచర్- రూ.26000 నుంచి 30000; సెకండరీ టీచర్- రూ.32000 నుంచి 38000; అసిస్టెంట్ ఆఫీసు సూపరింటెండెంట్- రూ.25000 నుంచి 30000 అందిస్తారు.

దరఖాస్తు విధానం:

 • ఆఫ్ లైన్

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

 • DEFENCE LABORATORIES’ SCHOOL, VIGNYANAKANCHA, RCI, HYDERABAD – 500069.
  Ph. No. 040-24301752/53.

మెయిల్ ఐడీ:

 • DLSRCI.RECRUITMENT@GMAIL.COM

దరఖాస్తుకు చివరి తేదీ:

 • 10-06-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి