iDreamPost

డిగ్రీ పాసైతే చాలు? ఈ Bank ఉద్యోగాలు మీకోసమే.. మంచి జీతం

మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ప్రముఖ బ్యాంకులో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ప్రముఖ బ్యాంకులో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

డిగ్రీ పాసైతే చాలు? ఈ Bank ఉద్యోగాలు మీకోసమే.. మంచి జీతం

బ్యాంక్ సెక్టార్ లో ఉద్యోగాలకు విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. యువత బ్యాంక్ జాబ్స్ కోసం ఏళ్లతరబడి ప్రిపేర్ అవుతుంటారు. బ్యాంక్ జాబ్స్ అయితే మంచి వేతనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, సెలవులు ఎక్కువగా ఉండడంతో బ్యాంక్ జాబ్స్ కు క్రేజ్ ఎక్కువ. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి సమయం. మీరు డీగ్రీ ఉత్తీర్ణులైతే చాలు బ్యాంక్ జాబ్స్ ను పొందే ఛాన్స్ వచ్చింది. ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలిచిన వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థల నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు కనీసం 28 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. డాక్యూమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 9000 వేల స్టైఫండ్ ను అందిస్తారు. ఇతర అలవెన్సులు గానీ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అర్హత:

  • అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి :

  • అభ్యర్థులు కనీసం 28 సంవత్సరాల వయస్సు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • పత్రాల ధృవీకరణ ఆధారంగా ఉంటుంది.

జీతం:

  • అప్రెంటిస్ పోస్ట్‌కి ఎంపికైతే నెలవారీ జీతం రూ 9,000 అందుకుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి