iDreamPost

AP 10Th ఫలితాల్లో మెరిసిన విద్యార్థి.. 600లకు ఏకంగా 596 మార్కులు

ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో పలువురు విద్యార్థులు రికార్డు మార్కులతో సత్తాచాటారు. ఓ విద్యార్థి 600లకు ఏకంగా 596 మార్కులు సాధించాడు.

ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో పలువురు విద్యార్థులు రికార్డు మార్కులతో సత్తాచాటారు. ఓ విద్యార్థి 600లకు ఏకంగా 596 మార్కులు సాధించాడు.

AP 10Th ఫలితాల్లో మెరిసిన విద్యార్థి.. 600లకు ఏకంగా 596 మార్కులు

పదో తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదలవుతాయా అని ఎదురుచూసిన తరుణంలో నేడు రిలీజ్ అయ్యియి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది టెన్త్ విద్యార్థుల భవితవ్యం తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సోమవారం(ఏప్రిల్ 22)నాడు టెన్త్ ఫలితాలను ప్రకటించింది. కాగా ఈ రోజు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు రికార్డ్ మార్కులతో అదరగొట్టారు. పరీక్షల్లో అసాధారణ ప్రతిభ చూపి ఆల్ టైమ్ రికార్డ్ మార్కులను పొందారు. ఇక ఈ ఫలితాల్లో తెనాలి పట్టణానికి చెందిన పాటిబండ్ల ప్రభాకర్ అనే విద్యార్థి తన సత్తా చాటాడు. 600 మార్కులకు 596 మార్కులు సాధించి అందరిచే ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఏపీలోని తెనాలి పట్టణంలోని ఐతానగర్ ప్రాంతానికి చెందిన పాటిబండ్ల ప్రభాకర్ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మెరిసాడు. 600 మార్కులకు 596 మార్కులు సాధించి సరికొత్త హిస్ట్రీ క్రియేట్ చేశాడు. తెనాలిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో టెన్త్ విద్యార్థి ప్రభాకర్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పాటిబండ్ల ప్రభాకర్ ను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించారు. కాగా ఈ ఏడాది మొత్తం 6,23,092 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,02,528 మంది గతంలో పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులు కూడా ఉన్నారు. తాజా ఫలితాల్లో 86.69 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా టెన్త్ ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతంతో బాలికలు మరోసారి సత్తా చాటారు.

ఏపీ టెన్త్ ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన విషయం తెలిసిందే. పదో తరగతిలో 600కు గాను 599 మార్కులు సాధించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక పరీక్షల్లో ఫెయిలైన వారికి మే 24 నుంచి జూన్‌ 3 వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్కులు తక్కువగా వచ్చాయని భావించిన వారి నుంచి రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి