iDreamPost
android-app
ios-app

వినేవాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెప్తాడు: మంత్రి బొత్స

వినేవాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెప్తాడు: మంత్రి బొత్స

ఏపీలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో ఉంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అధికార పార్టీ నేతలు తక్కువ ధరలకే భూములను తీసుకుంటున్నారని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. వారికి ధీటుగా అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. గ్రోత్ సెంటర్ భూములను తక్కువ ధరకే ప్రభుత్వం మంత్రి బొత్స సత్యనారాయణ కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. వారి మాటలకు మంత్రి బొత్స కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రామోజీరావులా దోచుకోవడం తనకు తెలియదని బొత్స మండిపడ్డారు. గ్రోత్  సెంటర్ భూములపై రామోజీకి మంత్రి బొత్స సవాల్ విసిరారు.

శనివారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. వినే వాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెప్తాడంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గ్రోత్ సెంటర్  ద్వారా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ జరుగుతోందని తెలిపారు. రామోజీ రావు కావాలంటే తమకు ఇచ్చిన ధరలకే ఆ భూములు ఇస్తామని తెలిపారు. 2018లో గ్రోత్ సెంటర్  భూములకు జీవీ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సీఎం జగన్ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు. చంద్రబాబులా దళారులను పెట్టి దోచుకోలేదు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ముగ్గురు మూడు దిక్కులు తిరిగి ప్రభుత్వంపై అక్కస్తు వెళ్లగక్కుతున్నారు. వారు ఎందుకు సహనం కోల్పోతున్నారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలి. హోదను మా ప్రభుత్వం తాకట్టు పెట్టలేదు. మీలాగా స్వీట్స్ పంచుకోలేదు. ఎదుటి వారు ఏమనుకుంటారునే కనీసం సిగ్గు కూడా లేకుండా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు పాలన ఏమీ  బాగుందో పవన్ చెప్పాలి. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది” అంటూ మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. రామోజీ రావుపై మంత్రి చేసిన సవాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రౌడీ షీటర్లకి ఎంట్రీ లేదు.. మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి DSP వార్నింగ్!